News February 19, 2026

పల్నాడు: జిల్లాలో 7 కొత్త విద్యుత్ సబ్‌స్టేషన్ల నిర్మాణం!

image

పల్నాడు జిల్లా ప్రజలకు నాణ్యమైన విద్యుత్ అందించడమే లక్ష్యంగా ఏడు కొత్త విద్యుత్ సబ్‌స్టేషన్ల నిర్మాణం చేపట్టినట్లు ఏపీ సీపీడీసీఎల్ విజయవాడ డైరెక్టర్ టీవీఎస్‌ఎన్ మూర్తి వెల్లడించారు. గురువారం జిల్లా విద్యుత్ శాఖ కార్యాలయంలో అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. విద్యుత్ అంతరాయం కలగకుండా తీసుకుంటున్న ముందస్తు చర్యలపై చర్చించారు.

Similar News

News February 20, 2026

సంతోషిమాత వ్రతం: పాటించాల్సిన నియమాలు

image

ఈ వ్రతంలో అత్యంత కఠినమైన నియమం పులుపు పదార్థాలకు దూరంగా ఉండటం. వ్రతం చేసే వ్యక్తితో పాటు కుటుంబ సభ్యులు కూడా ఆ రోజున నిమ్మకాయ, చింతపండు, పెరుగు ముట్టుకోకూడదు. ఇంట్లో పులుపుతో వంటలు చేయకూడదు. వ్రతం రోజున అబద్ధాలు ఆడటం, ఇతరులను దూషించడం చేయరాదు. పూర్తి బ్రహ్మచర్యం పాటించాలి. మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలి. అమ్మవారి నామస్మరణ చేయాలి. నైవేద్యంగా పెట్టిన బెల్లం, శనగలను మాత్రమే ప్రసాదంగా తీసుకోవాలి.

News February 20, 2026

శ్రీకాకుళంలో మర్చి 13 నుంచి రెవెన్యూ క్రీడలు

image

శ్రీకాకుళంలో వచ్చే నెల 13 నుంచి 15వ తేదీ వరకు రెవెన్యూ క్రీడలు నిర్వహించనున్నట్లు టెక్కలి ఆర్డీవో ఎం. కృష్ణమూర్తి తెలిపారు. గురువారం సబ్ కలెక్టర్ కార్యాలయంలో రెవెన్యూ అసోసియేషన్ ప్రతినిధులతో సమావేశమై క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణపై సమీక్షించారు. డిప్యూటీ కలెక్టర్ క్యాడర్ స్థాయి అధికారులతో క్రీడలు ప్రారంభమవుతాయని చెప్పారు. మండలాల నుంచి ఎక్కువ మంది పాల్గొనేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

News February 20, 2026

తానెంత గొప్ప బ్యాటరో అభిషేక్ గుర్తుచేసుకోవాలి: నాసర్ హుసేన్

image

భారత స్టార్ క్రికెటర్ అభిషేక్ శర్మ మానసిక సమస్య వల్ల పరుగులు చేయలేకపోతున్నారని ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ నాసర్ హుసేన్ అభిప్రాయపడ్డారు. ‘<<19180377>>మూడు డకౌట్లు<<>> మానసికంగా ఇబ్బందిపెడతాయి. అభిషేక్ మంచి హిట్టర్. అతడు తన గత ప్రదర్శనలు గుర్తు చేసుకోవాలి. తన భారీ ఇన్నింగ్సుల వీడియోలను తెప్పించుకుని చూడాలి. తాను ఎంత గొప్ప బ్యాటర్ అనేది అభిషేక్ గుర్తు చేసుకోవాలి’ అని సూచించారు.