News February 24, 2025
పల్నాడు జిల్లా ఆసుపత్రిలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ

పల్నాడు జిల్లా ఆసుపత్రిని సోమవారం జిల్లా కలెక్టర్ పి. అరుణ్ బాబు అకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రి సూపరిండెంట్ డా.రంగారావును వైద్య సేవల వివరాలడిగి తెలుసుకున్నారు. వైద్యశాలలో రోగులను పలకరించి మాట్లాడారు. జిల్లాలో జరుగుతున్న సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ప్రక్రియకు సంబంధించి, విజువల్ సర్టిఫికెట్లు వివరాలను తెలుసుకున్నారు. ఎప్పటికప్పుడు సర్టిఫికెట్ల సమాచారం ఆన్‌లైన్లో అప్లోడ్ చేయాలన్నారు.
Similar News
News February 24, 2025
ఫైబర్‌నెట్ ఎండీ దినేశ్ కుమార్‌పై వేటు

AP: ఫైబర్‌నెట్ ఎండీ దినేశ్ కుమార్‌పై వేటు పడింది. ఆయనను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జీఏడీకి రిపోర్టు చేయాలని దినేశ్ కుమార్‌ను ఆదేశించింది. మరోవైపు ఫైబర్‌నెట్ ఛైర్మన్ జీవీ రెడ్డి రాజీనామాను ప్రభుత్వం ఆమోదించింది. కాగా ఫైబర్‌నెట్‌కు చెందిన పూర్తి నివేదిక సీఎం చంద్రబాబు దగ్గరికి చేరినట్లు తెలుస్తోంది. దీని ఆధారంగానే ఎండీని జీఏడీకి అటాచ్ చేసినట్లు సమాచారం.
News February 24, 2025
మార్చి 21న ‘సలార్’ రీ రిలీజ్

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన బ్లాక్‌బస్టర్ మూవీ ‘సలార్’ రీ రిలీజ్‌కు సిద్ధమైంది. మార్చి 21న ఈ చిత్రాన్ని రీ రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన ఈ మూవీలో శ్రుతిహాసన్ హీరోయిన్‌గా నటించారు. 2023 డిసెంబర్ 22న విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద రూ.700 కోట్లకుపైగా కలెక్షన్లు రాబట్టింది. దీనికి పార్ట్-2 కూడా ఉంటుందని మేకర్స్ ప్రకటించారు.
News February 24, 2025
అసంపూర్తిగా ముగిసిన KRMB సమావేశం

TG: KRMB (కృష్ణా నదీ యాజమాన్య బోర్డు) సమావేశం అసంపూర్తిగా ముగిసింది. హైదరాబాద్ జలసౌధలో ఏపీ జలవనరులశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, టీజీ నీటిపారుదలశాఖ ముఖ్య కార్యదర్శితో బోర్డు ఛైర్మన్ రాహుల్ జైన్ సమావేశమయ్యారు. ఇందులో తెలంగాణ తన వాదనలు వినిపించగా, ఏపీ మాత్రం ఎలాంటి వాదనలు వినిపించలేదు. పూర్తి వివరాలతో రేపు సమావేశానికి రావాలని ఇరు రాష్ట్రాలను బోర్డు కోరింది.