News March 1, 2025

పల్నాడు జిల్లా టాప్ న్యూస్

image

 ★ దాచేపల్లిలో పింఛన్ డబ్బుతో సచివాలయం ఉద్యోగి పరార్ ★ నరసరావుపేట: సీఎం చంద్రబాబుపై మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి ఫైర్★ సత్తెనపల్లిలో పరీక్షా కేంద్రం మార్పుపై ఇంటర్ విద్యార్థుల ఆందోళన★ చిలకలూరిపేట: బ్యాంకు కుంభకోణంలో నిందితుడి అరెస్ట్★ పల్నాడు జిల్లాలో ఇంటర్ పరీక్షలకు 759 మంది విద్యార్థులు గైర్హాజరు★ లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తే కఠిన చర్యలు: కలెక్టర్..

Similar News

News March 2, 2025

ఖమ్మం: కానిస్టేబుల్‌ను అభినందించిన సీపీ

image

టాటా అల్ట్రా మారథాన్ 50 కిలోమీటర్ల రన్‌లో మెడల్ సాధించిన కానిస్టేబుల్‌ను పోలీస్ కమిషనర్ సునీల్ దత్ శనివారం అభినందించారు. రాష్ట్రం, దేశంలో ఎక్కడ మారథాన్ నిర్వహించినా పాల్గొంటూ ప్రతిభ కనబరిచి పతకాలు సాధిస్తున్నట్లు ఖమ్మం ఏఆర్ కానిస్టేబుల్ పిల్లి రాజు తెలిపారు. గత నెల 23న పూణె సమీపంలోని లోనావాలా సయ్యాద్రి కొండలల్లో మారథాన్ రన్ 50 కిలోమీటర్లను 6గంటల 39 నిమిషాల్లో పూర్తి చేశారని చెప్పారు.

News March 2, 2025

మిర్యాలగూడ: GREAT.. మెడికల్ కాలేజీకి పార్థివదేహం అందజేత   

image

కొందరు అవయవ దానం చేస్తే మరికొందరు నేత్ర దానం చేస్తారు. వాటి కంటే మిన్నగా మిర్యాలగూడకు చెందిన రేపాలలక్ష్మీనారాయణ కుటుంబ సభ్యులు మెడికల్ కళాశాలకు అతడి పార్థివదేహాన్ని అందజేశారు. తమ తండ్రి చివరి కోరిక కావడంతో శనివారం నల్గొండ ప్రభుత్వ మెడికల్ కళాశాలకు ఆయన పార్థివదేహాన్ని కుటుంబ సభ్యులు అందజేశారు. మరణంలోనూ తమ తండ్రి జీవించి ఉండాలనే ఆలోచనతోనే ఇలా చేశామని తెలిపారు.

News March 2, 2025

గీసుగొండ: బాలికపై లైంగికదాడి

image

నాలుగు సంవత్సరాల బాలికపై లైంగికదాడి చేసిన ఘటన గీసుగొండ మండలంలో చోటు చేసుకుంది. గీసుగొండ సీఐ మహేందర్ తెలిపిన వివరాల ప్రకారం.. ఉపాధి కోసం దంపతులు ఇతర రాష్ట్రం నుంచి గీసుగొండ మండలానికి వచ్చారు. ఇక్కడ పని చేస్తూ జీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలో రాజు అనే వ్యక్తి 4 సంవత్సరాల బాలికపై లైంగికదాడికి పాల్పడ్డాడు. బాలిక తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు.

error: Content is protected !!