News March 31, 2025

పల్నాడు జిల్లా టుడే టాప్ న్యూస్

image

☞ నరసరావుపేటలో హీరో కళ్యాణ్ రామ్ సందడి☞ బొల్లాపల్లి: ఇరువర్గాల మధ్య ఘర్షణ, గాయాలు☞ శావల్యాపురం: రైలు కిందపడి గుర్తు తెలియని వ్యక్తి మృతి☞ మాచవరం: వైస్ ఎంపీపీ చింతపల్లి సైదాకు రిమాండ్☞ రాజుపాలెం: పంట పొలాల్లోకి కారు బోల్తా☞ కారంపూడి: జనసేనలో చేరిన వైయస్సార్సీపి సర్పంచ్☞ చిలకలూరిపేట: ట్రాక్టర్ బోల్తా యువకుని మృతి ☞ క్రోసూరు: విఆర్‌కు ఎస్ఐ నాగేంద్ర

Similar News

News September 14, 2025

నేడు శ్రీ సత్యసాయి జిల్లా ఎస్పీ బాధ్యతల స్వీకరణ

image

శ్రీ సత్యసాయి జిల్లా ఎస్పీగా సతీశ్ కుమార్ నేడు బాధ్యతలు చేపట్టనున్నారు. ఉదయం 10:30 గంటలకు ఆయన పుట్టపర్తికి చేరుకొని జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించే ప్రత్యేక పూజలో పాల్గొంటారు. అనంతరం బాధ్యతలు చేపట్టనున్నట్లు పోలీస్ అధికారులు తెలిపారు. ఈయన గతంలో గుంటూరులో పని చేశారు.

News September 14, 2025

భువనగిరి: రేపు జిల్లా స్థాయి టీఎల్‌ఎం మేళా

image

ఈ నెల 15న జిల్లా స్థాయి టీఎల్‌ఎం మేళాను నిర్వహిస్తున్నట్లు జిల్లా విద్యాధికారి సత్యనారాయణ తెలిపారు. మండల స్థాయిలో ఎంపికైన ఉత్తమ టీఎల్‌ఎంలను ప్రదర్శించాలని ఆయన సూచించారు. భువనగిరి కలెక్టరేట్ దగ్గరలోని ఏకే ప్యాలెస్‌లో ఉదయం 9 గంటలకు కార్యక్రమం ప్రారంభమవుతుందన్నారు. ఈ సమాచారాన్ని ఆయా మండల విద్యాధికారులు ఉపాధ్యాయులకు తెలియజేయాలని పేర్కొన్నారు.

News September 14, 2025

బాపట్ల జిల్లా మూడో ఎస్పీగా ఉమామహేశ్వర్

image

నూతనంగా ఏర్పడిన బాపట్ల జిల్లాలో మూడవ ఎస్పీగా ఉమామహేశ్వర్ బాధ్యతలు స్వీకరించనున్నారు. బాపట్ల జిల్లాలో తొలి ఎస్పీగా వకుల్ జిందాల్, రెండో ఎస్పీగా తుషార్ డూడి బాధ్యతలు నిర్వహించి బదిలీ అయ్యారు. మూడో ఎస్పీగా ఉమామహేశ్వర్ ఆదివారం ఉదయం 10 గంటలకు బాధ్యతలు స్వీకరిస్తారని పోలీస్ కార్యాలయ వర్గాలు వెల్లడించాయి. నూతన ఎస్పీకి స్వాగతం పలికేందుకు పోలీస్ సిబ్బంది చర్యలు చేపట్టారు.