News April 5, 2025
పల్నాడు జిల్లా టుడే టాప్ న్యూస్

☞ నరసరావుపేట: బాబు జగ్జీవన్ రామ్‌కు నివాళులర్పించిన కలెక్టర్, ఎస్పీ, ☞ రాజుపాలెం: రోడ్డు ప్రమాదంలో మహిళ తలకు గాయాలు, ☞ గురజాల: అధికార పార్టీపై మాజీ ఎమ్మెల్యే కాసు మహేశ్ ఫైర్, ☞ మాచర్ల: ఎంపీటీసీ కుటుంబానికి మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి పరామర్శ, ☞ చిలకలూరిపేట: యువకుడి ఆత్మహత్య, ☞ దుర్గి: నాటు సారా తయారీ అనర్ధాలపై అవగాహన కల్పించిన అధికారులు, ☞ శావల్యాపురం: అక్రమ మద్యం అమ్ముతున్న వ్యక్తి అరెస్ట్.
Similar News
News February 19, 2026
VJA: బ్యాంకు ఒప్పంద ఉద్యోగుల చేతివాటం.. స్కాముల్లోను వారే!

విజయవాడలోని బ్యాంక్ అవుట్‌సోర్సింగ్ సిబ్బంది అక్రమాలు కలకలం రేపుతున్నాయి. ఇటీవల గవర్నర్‌పేటలోని ఓ బ్యాంక్ లాకర్లో రూ.50 లక్షల బంగారం మాయం కాగా, సిబ్బంది గుట్టుగా రికవరీ చేశారు. మరోవైపు సైబర్ నేరాలకు వాడే ‘మ్యూల్ ఖాతాల’ వెనుక వీరి పాత్ర ఉండటంతో పోలీసులు విచారణ ముమ్మరం చేశారు. ఇప్పటికే ఏ4 నిందితుడిగా దుర్గాప్రసాద్‌ను అరెస్ట్ చేయగా, పలువురు మేనేజర్లను పోలీసులు విచారిస్తున్నారు.
News February 19, 2026
NTR: ఎం.ఫార్మసీ పరీక్షల షెడ్యూల్ విడుదల

ఆచార్య నాగార్జున యూనివర్శిటీ పరిధిలోని కాలేజీలలో ఎం.ఫార్మసీ విద్యార్థులు Y25 బ్యాచ్(రెగ్యులర్) & Y22, Y23, Y24 బ్యాచ్‌లు(సప్లిమెంటరీ) రాయాల్సిన 1వ సెమిస్టర్ థియరీ పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. ఈ పరీక్షలు మార్చి 30 నుంచి నిర్వహిస్తామని.. విద్యార్థులు ఎలాంటి ఫైన్ లేకుండా మార్చి 16లోపు, రూ.100 ఫైన్‌తో 17లోపు ఫీజు చెల్లించాలని ANU సూచించింది. వివరాలకు https://www.nagarjunauniversity.ac.in/ చూడాలంది.
News February 19, 2026
మద్యం తాగి వాహనం నడిపితే జైలుకే

కామారెడ్డి జిల్లాలో డ్రంక్ అండ్ డ్రైవ్‌పై పోలీసులు కొరడా ఝులిపిస్తున్నారు. గత 2నెలల్లో నిబంధనలు ఉల్లంఘించిన 1,176మందికి కోర్టు శిక్షలు విధించగా, అందులో 222 మందికి జైలు శిక్ష పడింది. ఒకరికి నెల రోజులు, ఐదుగురికి 15రోజుల జైలు శిక్ష ఖరారైంది. రూ.14.87లక్షల జరిమానా వసూలు చేసినట్లు పోలీస్ శాఖ తెలిపింది. మద్యం సేవించి వాహనాలు నడిపి ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని, ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని హెచ్చరించింది.


