News August 29, 2024

పల్నాడు జిల్లా నరసరావుపేటలో కత్తిపోట్ల కలకలం

image

పల్నాడు జిల్లా నరసరావుపేటలో కత్తిపోట్లు కలకలం రేపాయి. పోలీసుల వివరాల ప్రకారం.. బుధవారం రాత్రి ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో పనిచేసి రిటైర్డ్ అయిన రాధాకృష్ణ అనే వ్యక్తి ఇంటికి వస్తున్న సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు అతనిపై కత్తులతో దాడి చేశారు. గాయపడిన వ్యక్తి నరసరావుపేటలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. నరసరావుపేట 1 టౌన్ పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Similar News

News March 2, 2026

రెవెన్యూ క్లీనిక్ కోసం కలెక్టరేట్‌లో 4 కౌంటర్లు ఏర్పాటు: కలెక్టర్

image

గుంటూరు జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో సోమవారం జరగనున్న పీజీఆర్ఎస్, రెవెన్యూ క్లీనిక్ కార్యక్రమాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా పిలుపునిచ్చారు. https://Meekosam.ap.gov.in సైట్‌లో కూడా అర్జీలు సమర్పించవచ్చని తెలిపారు. టోల్ ఫ్రీ 1100 ద్వారా అర్జీల స్థితిని తెలుసుకోవచ్చని సూచించారు. రెవెన్యూ క్లీనిక్ కోసం కలెక్టరేట్‌లో 4 కౌంటర్లు ఏర్పాటు చేశామని పేర్కొన్నారు.

News March 2, 2026

GNT: అంబటికి వైసీపీ నేతల పరామర్శ

image

అంబటి రాంబాబును మాజీ మంత్రులు కొడాలి నాని, మేకతోటి సుచరిత, కురసాల కన్నబాబు, మాజీ ఎమ్మెల్యేలు జక్కంపూడి రాజా, నంబూరు శంకరరావు ఆదివారం పరామర్శించారు. వారు మాట్లాడుతూ.. తప్పుడు కేసులకు, అక్రమ అరెస్ట్‌లకు, రెడ్ బుక్ రాజ్యాంగానికి భయపడేదిలేదని స్పష్టం చేశారు. అక్రమ కేసులతో వైసీపీ మరింతగా బలోపేతం అవుతుందని చెప్పారు.

News March 1, 2026

అమరావతిలో పలు శంకుస్థాపనలు.. ప్రారంభాలు చేసిన CJI

image

అమరావతిలో ఏపీ హైకోర్టు అతిథి గృహానికి, జ్యూడిషియల్ అకాడమీకి సుప్రీంకోర్టు CJI జస్టిస్ సూర్యకాంత్ ఆదివారం శంకుస్థాపన చేశారు. దీంతోపాటు హైకోర్టు న్యాయమూర్తుల సముదాయాలు ప్రారంభించారు. రూ.210 కోట్లతో 33.20 ఎకరాల్లో 36మంది జడ్జీలకు బంగ్లాలు నిర్మించారు. సీజేఐతో పాటు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, ముఖ్యమంత్రి చంద్రబాబు, హైకోర్టు న్యాయమూర్తులు పాల్గొన్నారు.