News April 4, 2025
పల్నాడు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్‌గా అశోక్ కుమార్

పల్నాడు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్‌గా డాక్టర్ ఎన్. అశోక్ కుమార్ నియమితులయ్యారు. కొద్ది రోజుల క్రితం సూపరింటెండెంట్‌గా విధులు నిర్వహించిన డాక్టర్ రంగారావు బదిలీపై గుంటూరు వెళ్లడంతో ఆయన స్థానంలో ప్రభుత్వం సురేశ్ కుమార్‌ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. శుక్రవారం బాధ్యతలు స్వీకరించిన ఆయన మాట్లాడుతూ.. పేద ప్రజలకు వైద్యశాలలో మెరుగైన వైద్య సేవలు అందించేందుకు కృషి చేస్తానని చెప్పారు.
Similar News
News April 11, 2025
ఒంటిమిట్టలో అన్నదాన కార్యక్రమం చేపడతాం: సీఎం చంద్రబాబు

తిరుమల తరహాలో ఒంటిమిట్ట రాములోరి ఆలయంలోనూ అన్నదాన కార్యక్రమం ప్రారంభిస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. భక్తులు ఆకలితో ఉండకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు. దీనిపై టీటీడీ నిర్ణయం తీసుకోవాలని సూచించారు. దీనిపై టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు స్పందిస్తూ.. త్వరలో టీటీడీ బోర్డులో చర్చించి నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు. భవిష్యత్తులో ఆలయాన్ని మరింత అభివృద్ధి చేస్తామని సీఎం పేర్కొన్నారు.
News April 11, 2025
ట్రంప్ హెచ్చరికలను పట్టించుకోని జిన్‌పింగ్!

అమెరికా-చైనా వాణిజ్య యుద్ధం ట్రంప్-జిన్ పింగ్‌ల మధ్య వ్యక్తిగతంగా చిచ్చుపెట్టినట్లు తెలుస్తోంది. సుంకాలపై జిన్‌పింగ్‌ను ట్రంప్ ప్రైవేటుగా హెచ్చరించారని అంతర్జాతీయ మీడియా తెలిపింది. ట్రంప్ హెచ్చరికలను జిన్ ఏ మాత్రం పట్టించుకోలేదని, బదులుగా టారిఫ్స్‌ను 125 శాతానికి పెంచారని పేర్కొంది. ఇరు అగ్రదేశాల మధ్య ఘర్షణ ప్రపంచ వాణిజ్యానికి ముప్పుగా మారనుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
News April 11, 2025
ముగ్ధమనోహరంగా శ్రీరాముడి రూపం

యావత్ జగత్తుకి రాముడి జీవితం ఆదర్శప్రాయం. పదహారు గుణములు కలిగిన పరిపూర్ణమైన మానవుడి అవతారం రామచంద్రమూర్తిది. దిక్కులు పెక్కటిల్లేలా శివధనస్సుని విరిచి జానకిని తన సొంతం చేసుకున్నాడు. తన పరాక్రమంతో శత్రువులను జయించాడు. తేజోవంతమయిన రాఘవుడి సౌందర్య రూపం చూసేందుకు రెండు కన్నులు చాలవు కదా. నేడు ఒంటిమిట్టలో పెళ్లికొడుకు, పెళ్లికూతురిగా ముగ్ధమనోహరంగా దర్శనమిచ్చిన ఆ సీతారాములను చూసిన భక్తజనం మైమరిచిపోయారు.