News October 28, 2025
పల్నాడు జిల్లా రైలు మార్గాల మీద సీఎం సమీక్ష

పల్నాడు జిల్లా మీదగా వెళ్లే రైలు మార్గాల మీద సీఎం చంద్రబాబు అధికారులతో సమీక్షించారు. ప్రధానంగా 3.4 లక్షల కోట్లతో కేంద్ర ప్రభుత్వం నిర్మించనున్న హైదరాబాద్- చెన్నై కారిడార్‌పై సమీక్షించారు. గంటకు 350 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే బుల్లెట్ ట్రైన్ మార్గం పల్నాడు జిల్లాలో 81కిలోమీటర్ల మేర నిర్మించాల్సి ఉంది. నడికుడి – శ్రీకాళహస్తి రైల్వే పనులపై కార్యాచరణ వేగవంతం చేయాలని సీఎం అధికారులకు సూచించారు.
Similar News
News October 28, 2025
సూర్యాపేట: పోలీస్ వాహనాలను తనిఖీ చేసిన ఎస్పీ

బాధితులకు వేగవంతంగా పోలీసు సేవలు అందించడంలో పోలీసు వాహనాలు కీలకమని ఎస్పీ నరసింహ అన్నారు. మంగళవారం సూర్యాపేటలోని ఎస్పీ కార్యాలయంలో పోలీసు వాహనాల నాణ్యతను, కండిషన్‌ను తనిఖీ చేసి మాట్లాడారు. ప్రజలకు సేవలు అందించే వాహనాలు పూర్తి కండిషన్లో ఉండాలని, వాటిని ఎక్కువ కాలం ఉపయోగించేలా ఎప్పటికప్పుడు పరిశీలించుకోవాలన్నారు. పూర్తిస్థాయిలో పర్యవేక్షణ చేయాలని పోలీస్ మోటార్ ట్రాన్స్పోర్ట్ అధికారిని ఆదేశించారు.
News October 28, 2025
వనపర్తి: బాల్యవివాహాలు జరగకుండా ముందస్తు చర్యలు

వనపర్తి జిల్లాలో బాల్యవివాహాలు జరగకుండా అన్ని ముందస్తు జాగ్రత్తలు అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా ఎస్పీ గిరిధర్‌తో కలిసి జిల్లా స్థాయి బాలల పరిరక్షణ సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. వనపర్తి జిల్లాలో ఒక్క బాల్య వివాహం కూడా జరగకుండా అన్ని ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
News October 28, 2025
కాల్స్ అన్నీ రికార్డ్ చేస్తారంటూ ప్రచారం.. నిజమిదే

వాట్సాప్ కాల్స్‌కు సంబంధించి కొత్త నిబంధనలు అమల్లోకి రాబోతున్నాయని జరుగుతున్న ప్రచారాన్ని హైదరాబాద్ పోలీసులు ఖండించారు. అన్ని ఫోన్ కాల్స్ రికార్డు చేసి సేవ్ చేస్తారని, సోషల్ మీడియా ఖాతాలను పర్యవేక్షిస్తారంటూ సర్క్యులేట్ అవుతున్న నకిలీ పోస్టర్‌ను నమ్మొద్దని సూచించారు. ‘ఈ పోస్టర్‌లోని సమాచారం పూర్తిగా అవాస్తవం. పోలీసులు దీనిని విడుదల చేయలేదు. దీనిని ఎవరూ షేర్ చేయొద్దు’ అని Xలో రాసుకొచ్చారు.


