News March 12, 2025
పల్నాడు జిల్లా విద్యాశాఖ అధికారి సూచనలు

పల్నాడు జిల్లాలో పదవ తరగతి దూరవిద్య పరీక్షలకు 1,200 మంది హాజరవుతున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారిని ఎల్ చంద్రకళ తెలిపారు. మొత్తం 27 పరీక్షా కేంద్రాలలో 57 మంది ఇన్విజిలేటర్ల పర్యవేక్షణలో 27 మంది చొప్పున చీఫ్ సూపరిండెంట్లు, సిట్టింగ్ స్క్వాడ్లు పరీక్షలు జరుపుతారు అన్నారు. మండల విద్యాశాఖ అధికారులు ఆయా పరీక్షా కేంద్రాలలో మౌలిక వసతులను పరిశీలించాలని డీఈవో ఎల్ చంద్రకళ ఆదేశాలు ఇచ్చారు.
Similar News
News November 5, 2025
పేదలను ఓటు వేయనీయకండి: కేంద్ర మంత్రి

ఎన్నికల రోజు పేదలను పోలింగ్ బూత్‌కు రాకుండా అడ్డుకోండి అంటూ కేంద్రమంత్రి, JDU నేత రాజీవ్ రంజన్ సింగ్ అలియాస్ లలన్ సింగ్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. బిహార్‌లోని మొకామాలో జరిగిన ఎన్నికల ప్రచారంలో ‘పేదలను ఓటు వేయకుండా అడ్డుకోండి’ అంటూ ఆయన పిలుపునిచ్చారు. ఈ వీడియో వైరలవ్వడంతో పట్నా జిల్లా పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు. ఎన్నికల కమిషన్ కూడా వివరణ ఇవ్వాలని నోటీసులు ఇచ్చింది.
News November 5, 2025
పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లో 750 పోస్టులు

<
News November 5, 2025
కర్నూలు జిల్లాలో SIల బదిలీలు: SP

కర్నూలు జిల్లాలో SIల బదిలీలు చేపట్టినట్లు ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు. మంగళవారం బదిలీల ఉత్తర్వులు జారీ చేశారు. గూడూరు SI అశోక్‌ను కర్నూలు తాలూకా PSకు, SI ఎం.తిమ్మయ్యను కర్నూలు 3 టౌన్ నుంచి కర్నూలు 2 టౌన్‌కు, SI జి.హనుమంత రెడ్డిని 2 టౌన్ నుంచి గూడూరుకు, SI ఏసీ పీరయ్యను కర్నూలు తాలూకా PS నుంచి కర్నూలు 3 టౌన్‌కు బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.


