News December 9, 2025
పల్నాడు జిల్లా విద్యాశాఖ అధికారిగా రామారావు

పల్నాడు జిల్లా విద్యాశాఖ అధికారిగా పి.వి.జి. రామారావును నియమిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, విద్యాశాఖ ఉన్నతాధికారులు మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు విద్యాశాఖ ఉన్నతాధికారి కోన శశిధర్ ఆదేశాలు ఇచ్చారు. కాగా, పల్నాడు జిల్లా డీఈఓగా పనిచేస్తున్న చంద్రకళను కృష్ణా జిల్లా విద్యాశాఖ అధికారిగా బదిలీ చేశారు.
Similar News
News April 5, 2026
జగ్జీవన్ రామ్ సేవలు చిరస్మరణీయం: హరీశ్ రావు

భారత మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా ఆయనకు ఘన నివాళులు అర్పిస్తున్నామని మాజీ మంత్రి హరీశ్ రావు తెలిపారు. సమానత్వం, సామాజిక న్యాయం కోసం జీవితాంతం పోరాడిన మహనీయుడిగా బాబు జగ్జీవన్ రామ్ గుర్తుండిపోతారన్నారు. పీడిత వర్గాల అభ్యున్నతి, కార్మికుల హక్కుల పరిరక్షణలో ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమన్నారు. ఆయన ఆశయ సాధనలో మనమందరం భాగస్వాములమవుదామని పిలుపునిచ్చారు.
News April 5, 2026
రేపు బాసరలో అర్జిత సేవలు రద్దు

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమవారం బాసర సరస్వతి ఆలయంలో రూ. 225 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు అక్షరాభ్యాసాలు, కుంకుమార్చనలు, సత్యనారాయణ వ్రతాలు వంటి ఆర్జిత సేవలను రద్దు చేస్తున్నట్లు ఆలయ అధికారులు ప్రకటించారు. భక్తులు ఈ మార్పును గమనించి సహకరించాలని కోరారు.
News April 5, 2026
ఇరాన్‌లో అమెరికన్ పైలట్ సేఫ్?

ఇరాన్‌లో <<19561241>>కూలిన అమెరికా F-15E<<>> యుద్ధ విమానంలోని రెండో పైలట్‌ను రెస్క్యూ టీమ్ రక్షించినట్లు సమాచారం. ఈ క్రమంలో ఇరాన్ దళాలతో భారీ కాల్పులు జరిగాయని US అధికారి ఒకరు తెలిపారు. రెస్క్యూ టీమ్ ప్రస్తుతం ఇరాన్ సరిహద్దు దాటే యత్నాల్లో ఉన్నట్లు చెప్పారు. పైలట్ ఆరోగ్యం విషమంగా ఉన్నట్లు సమాచారం. అంతకుముందు పైలట్‌ను కనుగొనేందుకు ఇరాన్ భారీ ఆపరేషన్‌ను చేపట్టింది. సమాచారం ఇచ్చిన వారికి రివార్డూ ప్రకటించింది.


