News January 2, 2026

పల్నాడు: టిప్పర్ ఢీకొని మహిళ మృతి

image

క్రోసూరు మండలం అందుకూరు వెళ్లే రోడ్డు మూల వద్ద టిప్పర్ లారీ ఢీకొట్టడంతో మహిళ మృతి చెందింది. స్థానికుల వివరాల మేరకు.. అచ్చంపేట మండలం ఓర్వకల్లు గ్రామానికి చెందిన కోట కుమారిని లారీ ఢీకొట్టడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. క్రోసూరు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదానికి గల కారణాలు పరిశీలించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News February 5, 2026

వీర్నపల్లి: ఈ చిన్నారులను ఆదుకోండి

image

విధి ఆడిన వింత నాటకంలో ఇద్దరు చిన్నారులు అనాథలయ్యారు. వీర్నపల్లి మండలం కంచర్లకు చెందిన దేవోళ్ల హనుమంతు ఉపాధి కోసం బహ్రెయిన్ వెళ్లి గతేడాది సెప్టెంబర్‌లో గుండెపోటుతో మరణించారు. భర్త మృతిని తట్టుకోలేక భార్య పద్మ(సుమలత) నవంబర్‌లో ఆత్మహత్య చేసుకుంది. తల్లిదండ్రులను కోల్పోయిన ఇందు, లాస్యలు ఇప్పుడు దిక్కులేని వారై బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు. వారిని ఆదుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు.

News February 5, 2026

విజయనగరం: నిరుద్యోగులకు GOOD NEWS

image

ఈ నెల 7న విజయనగరం ప్రభుత్వ ఐటీఐలో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి అధికారి ఆర్.వహీదా తెలిపారు. ఉదయం 10 గంటలకు జరిగే ఈ ఎంపికల్లో పలు ప్రైవేట్ సంస్థలు పాల్గొంటాయన్నారు. పదో తరగతి నుంచి పీజీ వరకు అర్హత కలిగిన అభ్యర్థులు తమ ధ్రువపత్రాలు, బయోడేటాతో హాజరై ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

News February 5, 2026

భద్రాద్రి: జనవరిలో 49 ప్రమాదాలు.. 17 మంది మృతి

image

జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పని చేస్తూ ప్రత్యేక చర్యలు చేపట్టాలని కలెక్టర్ జితేష్ వి పాటిల్ ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లో రహదారి భద్రతా కమిటీ సమావేశాన్ని వీసీ ద్వారా నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా గత జనవరి నెలలో 49 రోడ్డు ప్రమాదాలు జరగగా, అందులో 17 మంది ప్రాణాలు కోల్పోయాలని, బ్లాక్ స్పాట్స్ గుర్తించి, చర్యలు చేపట్టాలని సిబ్బందిని కలెక్టర్ ఆదేశించారు.