News February 12, 2025

పల్నాడు: టెన్త్ అర్హతతో 34 ఉద్యోగాలు

image

పల్నాడు జిల్లా (డివిజన్)లో 34 GDS పోస్టుల భర్తీకి భారత తపాలా శాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. టెన్త్ అర్హతతో కంప్యూటర్ నాలెడ్జ్ తప్పనిసరి. వయసు 18-40 ఏళ్ల మధ్య ఉండాలి. సైకిల్/ బైక్ నడిపే సామర్థ్యం ఉండాలి. టెన్త్‌లో మార్కుల మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. జనరల్, OBC, EWS వారికి దరఖాస్తు ఫీజు రూ.100. మిగిలిన వారికి ఉచితం. మార్చి 3వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

Similar News

News October 26, 2025

చిన్న శంకరంపేట: గుర్తుతెలియని మహిళా మృతదేహం లభ్యం

image

చిన్న శంకరంపేట మండలం దరిపల్లి శివారులోని హల్దీ వాగులో గుర్తు తెలియని మహిళ శవం కనిపించడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. మృతి చెందిన మహిళ ఎవరు అనేది ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. గ్రామంలో ఎవరైనా తప్పిపోయారా లేదా ఇతర గ్రామాల నుంచి వచ్చిన మహిళ ఇక్కడ చనిపోయిందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

News October 26, 2025

రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాలు.. అప్లైకి ఎల్లుండే లాస్ట్ డేట్

image

APPSC విడుదల చేసిన వివిధ ఉద్యోగాలకు దరఖాస్తు చేయడానికి ఎల్లుండే ఆఖరు తేదీ. అర్హతగల అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. ఫిషరీస్ అసిస్టెంట్ ఇన్‌స్పెక్టర్ (3), రాయల్టీ ఇన్‌స్పెక్టర్ (1), వార్డెన్(1), ఇన్‌స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్(1) పోస్టులు ఉన్నాయి. పోస్టును బట్టి సంబంధిత విభాగంలో డిప్లొమా, BSc, BEd, MA, BSc(జియోలజీ), ఇంజినీరింగ్ డిగ్రీ ఉత్తీర్ణులు అర్హులు. వెబ్‌సైట్: https://portal-psc.ap.gov.in/

News October 26, 2025

విద్యాసంస్థలకు సెలవులపై కలెక్టర్లకు సీఎం ఆదేశం

image

AP: తుఫాన్‌ను ఎదుర్కొనేందుకు సిద్ధం కావాలని, ఎక్కడా ప్రాణ-ఆస్తి నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని CM చంద్రబాబు ఆదేశించారు. SMS, సోషల్ మీడియా, IVRS కాల్స్, వాట్సాప్‌ ద్వారా ప్రజలను అప్రమత్తం చేయాలని సూచించారు. విద్యుత్, టెలికం, తాగునీటి సరఫరా నిరంతరం కొనసాగేలా చర్యలు తీసుకోవాలన్నారు. తుఫాన్ తీవ్రతను బట్టి విద్యాసంస్థలకు కలెక్టర్లు <<18106376>>సెలవులు<<>> ప్రకటించాలని టెలికాన్ఫరెన్స్‌లో చెప్పారు.