News March 31, 2025
పల్నాడు: దంచి కొడుతున్న ఎండలు.. 40 డిగ్రీల పైనే.!

పల్నాడు జిల్లాలో ఎండలు దంచి కొడుతున్నాయి. ఈ నేపథ్యంలో పట్టణాలు, ప్రాంతాల్లో ఉదయం 11 గంటలకే 40 డ్రిగ్రీల పైనే ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో ప్రజలు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. మార్చిలోనే ఇలా ఉంటే.. ఏప్రిల్, మే నెలలో ఉష్ణోగ్రతలు ఇంకేలా ఉంటాయోనని ప్రజలు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. కాగా ఎండ నుంచి ఉపశమనం పోందెందుకు.. కొబ్బరి నీళ్లు, చల్లటి పానీయాలు, పుచ్చకాయలు తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.
Similar News
News April 2, 2025
మామునూరు: GREAT.. గ్రూప్-1 ఆఫీసర్‌గా వాచ్‌మెన్ కుమారుడు

వరంగల్ జిల్లాకు చెందిన వాచ్‌మెన్ కుమారుడు గ్రూప్-1 ఆఫీసర్‌గా ఎంపికయ్యాడు. మామునూరుకు చెందిన జయ-రవికుమార్ దంపతుల కుమారుడు రాహుల్ ఇటీవల TGPSC విడుదల చేసిన గ్రూప్1 జనరల్ ర్యాంకింగ్ లిస్ట్‌లో 555వ ర్యాంక్, మల్టీ జోన్-1 SC కేటగిరీలో 23వ ర్యాంక్ కైవసం చేసుకున్నాడు. 2023-2024లో టీజీపీఎస్సీ నిర్వహించిన ఏవో, జేఏఓ ఎగ్జామ్‌లో రాహుల్ జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్(జేఏఓ)గా ఎన్నికయ్యారు.
News April 2, 2025
2 ఉద్యోగాలు సాధించిన వాంకిడి వాసి శివప్రసాద్

వాంకిడి మండలానికి చెందిన బెల్లాల రమేశ్, తార దంపతుల తనయుడు శివ ప్రసాద్ రెండు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించి సత్తాచాటారు. గత సంవత్సరం ఏపీజీబీలో జాబ్ చేస్తూ నిన్న వెలువడిన ఐబీపీఎస్ ఫలితాల్లో ఇండియన్ బ్యాంక్ క్లర్క్‌గా ఎంపికయ్యాడు. తల్లిదండ్రులు,గురువుల ప్రోత్సాహంతో ఇది సాధ్యమైందని శివప్రసాద్ తెలిపారు.
News April 2, 2025
నల్గొండ: రోడ్డుపై కారుతో స్టంట్స్.. యువకుడి అరెస్ట్

నల్గొండ నాగార్జున డిగ్రీ కళాశాల రోడ్డు పై షిఫ్ట్ డిజైర్ కార్‌తో స్టంట్స్ చేసిన యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. రోడ్డుపై వేగంగా స్టంట్స్ చేయడంతో ప్రజలు భయాందోనకు గురయ్యారు. గమనించిన ట్రాఫిక్ కానిస్టేబుల్ విజయ్ కారును పట్టుకునే ప్రయత్నం చేయగా సదరు యువకుడు కానిస్టేబుల్‌ను కారుతో భయపెట్టి పరారయ్యాడు. కాగా విషయం తెలుసుకున్న 2 టౌన్ పోలీసులు సాయంత్రం అతడిని అరెస్ట్ చేశారు.