News December 19, 2025
పల్నాడు: నిరుపయోగంగా సంపద కేంద్రాలు

పల్నాడు జిల్లాలో పంచాయతీల ఆదాయం పెంచేందుకు టీడీపీ ప్రభుత్వంలో సంపద తయారీ కేంద్రాలు ఏర్పాటు చేశారు. పల్నాడు జిల్లాలో వందలాది గ్రామ పంచాయతీల్లో ఏర్పాటుచేసిన చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాలు నిరుపయోగంగా మారాయి. కోట్లాది రూపాయలు వెచ్చించి నిర్మించిన వీటిని వినియోగించడంలో అధికారులు పట్టనట్లుగా ఉండటంతో గ్రామాల్లో పారిశుద్ధ్య లోపం అధికమైంది. వీధుల్లో సేకరించిన చెత్త శివారు ప్రాంతాల్లో పడేస్తున్నారు.
Similar News
News December 20, 2025
సింగరాయకొండ: చెరువులో యువకుడి మృత దేహం లభ్యం

సింగరాయకొండ మండలం సోమరాజు పల్లి పరిధిలోని మర్రి చెరువులో శనివారం గుర్తు తెలియని యువకుడి మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు గ్రామస్థుల సాయంతో మృతదేహాన్ని వెలికి తీయించారు. చనిపోయిన వ్యక్తిని ఎవరైనా గుర్తిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ఎస్సై మహేంద్ర తెలిపారు. మృతిని వివరాలు తెలియాల్సి ఉంది.
News December 20, 2025
బడ్జెట్‌పై ఊహాజనిత అంచనాలు వద్దు: GOVT

TG: FY26-27 బడ్జెట్‌కు ఊహాజనిత అంచనాలు పంపొద్దని ప్రభుత్వం అన్ని శాఖలను ఆదేశించింది. ‘ఖర్చు హేతుబద్ధంగా ఉండాలి. ఎక్కువ/తక్కువలు లేకుండా వాస్తవ రిక్వైర్మెంట్ మాత్రమే పంపాలి. అవసరం మేరకే మెయింటెనెన్స్, రెంట్, వాహనాలకు ఖర్చు చేయాలి’ అని ఆర్థిక శాఖ ఉత్తర్వులిచ్చింది. కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ స్టాఫ్ విషయంలో రేట్ కాంట్రాక్ట్, కాలం, ఎంతమంది అవసరం, ఖర్చు అంశాలు HRM నిబంధనల ప్రకారమే ఉండాలని సూచించింది.
News December 20, 2025
తాళ్లపాలెం: స్వచ్ఛ రథాలను జెండా ఊపి ప్రారంభించిన సీఎం

స్వర్ణాంధ్ర- స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కసింకోట మండలం తాళ్లపాలెంలో కొత్తగా ప్రవేశపెట్టిన స్వచ్ఛ రథాలను జండా ఊపి ప్రారంభించారు. అనంతరం స్వచ్ఛభారత్ మిషన్ 2.0 అభివృద్ధి పనుల్లో భాగంగా ప్లాస్టిక్ వ్యర్ధాల నిర్వహణ యూనిట్లు, గోబర్ దన్ ప్లాంట్, గ్రే వాటర్ నిర్వహణ నిర్మాణాలకు సీఎం శంకుస్థాపన చేశారు.


