News April 12, 2025
పల్నాడు: నేడు ఇంటర్ ఫలితాల కోసం ఎదురు చూపులు..!

పల్నాడు జిల్లాలో 31,672 మంది ఇంటర్ విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. వీరిలో 18,481 మంది ఫస్టియర్, 13,191 మంది సెకండియర్ విద్యార్థులు ఉన్నారు. శనివారం ఉదయం 11 గంటలకు ఇంటర్ పరీక్షల ఫలితాలు విడుదల కానున్నట్లు మంత్రి లోకేశ్ ట్వీట్ చేశారు. ఫలితాల విషయంలో ఎవరూ ఒత్తిడికి గురి కావొద్దని, ఎలాంటి అఘాయిత్యాలకు పాల్పడవద్దని అధికారులు సూచిస్తున్నారు. పరీక్షా ఫలితాల కోసం Way2News ఫాలో అవ్వండి.
Similar News
News July 4, 2025
బంజారాహిల్స్‌లోని వరుణ్ మోటార్స్ సీజ్

బంజారాహిల్స్ రోడ్ నం.2లోని వరుణ్ మోటార్స్‌ను GHMC అధికారులు సీజ్ చేశారు. గత రెండేళ్లుగా ట్రేడ్ లైసెన్స్ లేకుండా వరుణ్ మోటార్స్ నిర్వహకులు వ్యాపారం చేస్తుండడంతో పలుమార్లు అధికారులు నోటీసులు జారీ చేశారు. అయినా పట్టించుకోకపోవడంతో ఇవాళ సీజ్ చేశారు. గత మూడేళ్లుగా అడ్వర్‌టైజ్మెంట్ ఫీజులు బకాయి ఉన్నట్లు అధికారులు గుర్తించారు.
News July 4, 2025
పొంగులేటి పేపర్ యాడ్‌పై కాంగ్రెస్‌లో చర్చ

TG: మల్లిఖార్జున ఖర్గే పర్యటనపై మంత్రి పొంగులేటి ఇచ్చిన పేపర్ ప్రకటనలతో ఆ పార్టీలో కొత్త కలకలం రేగింది. పలు పేపర్లకు రెవెన్యూ మంత్రి ఇచ్చిన యాడ్లలో తెలంగాణ కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ఫొటో లేదు. ఇటీవల ఆయనను మీనాక్షి మందలించినట్లు వార్తలు రాగా, ఇప్పుడు ఫొటో లేకపోవడానికి కారణమదే అయ్యుండొచ్చని వినిపిస్తోంది. ఇదే సమయంలో మరో మంత్రి వివేక్ యాడ్లలో పార్టీ ఇన్‌ఛార్జ్ ఫొటో ఉంది(Slide:2).