News February 3, 2025

పల్నాడు: పెదనందిపాడులో అత్యాచారం, హత్య 

image

పెదనందిపాడులో దారుణ సంఘటన జరిగింది. 64 ఏళ్ల వృద్ధురాలిపై జైలు నుంచి బెయిల్‌పై వచ్చిన నిందితుడు మంజు అత్యాచారం చేసి హత్య చేశాడు. జరిగిన సంఘటనపై వృద్ధురాలి కుమార్తె ఇచ్చిన ఫిర్యాదు మేరకు ట్రైని ఎస్పీ దీక్షిత, డీఎస్పీ భానోదయ, సీఐ శ్రీనివాస రావులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. క్లూస్ టీమ్ వేలు ముద్రలను సేకరించింది. కేసు నమోదు చేసి మృతదేహాన్ని గుంటూరు జీజీహెచ్‌కి పోలీసులు తరలించారు. 

Similar News

News February 3, 2025

HYD: యాక్సిడెంట్.. MLA గన్‌మెన్ మృతి

image

రోడ్డు ప్రమాదంలో MLA గన్‌మెన్ మృతి చెందాడు. స్థానికుల వివరాలు.. శంకర్‌పల్లి మండలం బుల్కాపూర్‌కు చెందిన శ్రీనివాస్(34) ఆదివారం బీరప్ప జాతరకెళ్లాడు. జాతర ముగించుకుని స్వగ్రామానికి బయల్దేరాడు. కొండకల్ సమీపంలో గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. శ్రీనివాస్ చేవెళ్ల MLA కాలే యాదయ్య వద్ద గన్‌మెన్‌గా పని చేస్తున్నారు. ఈ ప్రమాదంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

News February 3, 2025

‘కన్నప్ప’ నుంచి ప్రభాస్ లుక్ రివీల్

image

మంచు విష్ణు హీరోగా నటిస్తోన్న ‘కన్నప్ప’ సినిమా నుంచి పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ లుక్ రివీల్ అయింది. ప్రభాస్ రుద్ర పాత్రలో కనిపించనున్నారు. ప్రభాస్ లుక్ అదిరిపోయిందంటూ అభిమానులు పోస్టులు పెడుతున్నారు. ఈ చిత్రం ఏప్రిల్ 25న విడుదల కానుంది. డార్లింగ్ లుక్ ఎలా ఉందో కామెంట్ చేయండి.

News February 3, 2025

GNT: SI అంటూ బెదిరించి రూ.24లక్షలు స్వాహా

image

ఎస్ఐ అంటూ బెదిరించి సైబర్ నేరగాళ్లు రూ.24 లక్షలు దోచేసిన వైనంపై కొత్తపేట పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల వివరాల మేరకు.. నెహ్రు నగర్‌కి చెందిన నాగేశ్వరరావుకు ఓ వ్యక్తి ఫోన్ చేసి ఎస్ఐ ప్రసాద్‌ను అని చెప్పాడు. బెంగళూరులో హ్యూమన్ ట్రాఫికింగ్ చేస్తున్న వ్యక్తిని అరెస్టు చేశామన్నాడు. ఆ కేసుతో సంబంధాలు ఉన్నాయని నాగేశ్వరావుని బెదిరించి విడతల వారీగా రూ.24లక్షలు నకిలీ ఎస్ఐ ఖాతాలోకి జమ చేయించుకున్నాడు.