News December 20, 2025

పల్నాడు: పొదుపు సంఘాల ముసుగులో రూ. 20 కోట్ల స్కామ్

image

పేదరిక నిర్మూలనకు అండగా ఉండాల్సిన సంస్థే పేద మహిళల ప్రాణాలతో చెలగాటమాడింది. బోగస్ పొదుపు సంఘాలను సృష్టించి, బ్యాంకుల నుంచి సుమారు రూ.20కోట్ల మేర అక్రమంగా రుణాలు పొందినట్లు విచారణలో వెలుగులోకి వచ్చింది. మహిళలు కష్టపడి చెల్లించిన పొదుపు సొమ్మును కూడా సంస్థ ఉద్యోగులు దుర్వినియోగం చేసినట్లు తేలింది. ఈ భారీ ఆర్థిక నేరంపై సమగ్ర విచారణ జరిపి, బాధ్యులపై పోలీసు కేసు నమోదు చేయాలని ఉన్నతాధికారులు ఆదేశించారు.

Similar News

News December 20, 2025

లోక్ అదాలత్‌లను సద్వినియోగం చేసుకోవాలి: ఎస్పీ జానకి షర్మిల

image

కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్న కేసులను లోక్ అదాలత్ ద్వారా కక్షిదారులు శాంతియుత మార్గంలో పరిష్కరించుకోవాలని ఎస్పీ జానకి షర్మిల సూచించారు. తక్కువ సమయంలో, ఎటువంటి ఖర్చు లేకుండా కేసులను ముగించుకునేందుకు ఇది గొప్ప అవకాశమన్నారు. రాజీ పడదగ్గ సివిల్, క్రిమినల్ కేసులను ఇరుపక్షాలు పరస్పర అంగీకారంతో పరిష్కరించుకోవాలని కోరారు. తద్వారా సమయం ఆదా కావడమే కాకుండా మనశ్శాంతి లభిస్తుందని ఎస్పీ పేర్కొన్నారు.

News December 20, 2025

వేములవాడ: పాత టెండర్లకు మంగళం.. 30న కొత్తవాటికి పిలుపు

image

వేములవాడ రాజన్న ఆలయంలో పాత టెండర్లను రద్దు చేశారు. అభివృద్ధి పనుల నేపథ్యంలో రాజన్న దర్శనాలను నిలిపివేసి భీమేశ్వరాలయానికి మార్చిన నేపథ్యంలో టెండర్లు రద్దు చేయాలని కాంట్రాక్టర్లు విజ్ఞప్తి చేశారు. దీంతో కొబ్బరి ముక్కల సేకరణ, బెల్లం, పూజా సామగ్రి విక్రయం, లాకర్ల నిర్వహణ తదితరాల టెండర్లను క్యాన్సిల్ చేశారు. భీమన్న ఆలయంలో కొత్తగా దుకాణాలు ఏర్పాటు చేయడానికి వీలుగా ఈనెల 30న కొత్త టెండర్లను పిలవనున్నారు.

News December 20, 2025

ఖమ్మం ప్రయాణికులకు రైల్వే శాఖ తీపి కబురు

image

ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. డిసెంబర్‌ 22న మచిలీపట్నం నుంచి ప్రయాగ్‌రాజ్ వెళ్లే వన్-వే స్పెషల్ రైలు (07401)కు ఖమ్మం రైల్వే స్టేషన్‌లో హాల్టింగ్ కల్పించారు. ఈ ప్రత్యేక రైలు గుడివాడ, విజయవాడ మీదుగా ప్రయాణిస్తూ ఖమ్మం చేరుకుంటుంది. ఇక్కడితో పాటు వరంగల్ స్టేషన్‌లోనూ ఈ రైలు ఆగుతుందని అధికారులు వెల్లడించారు.