News May 25, 2024

పల్నాడు: పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపుకు రంగం సిద్ధం

image

నరసరావుపేట పార్లమెంట్ పరిధిలో జూన్ 4న పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపుకు అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు. పార్లమెంట్ పరిధిలోని గురజాల, మాచర్ల, సత్తెనపల్లి నరసరావుపేట, పెదకూరపాడు, వినుకొండ, చిలకలూరిపేట అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో మొత్తం 19027 ఓట్లు నమోదు కాగా.. ఒక్కో టేబుల్‌కు 1058 ఓట్ల చొప్పున 18 టేబుల్స్ సిద్ధం చేస్తున్నారు.

Similar News

News September 13, 2025

నేడు గుంటూరు కలెక్టర్ బాధ్యతలు

image

గుంటూరు జిల్లా కలెక్టర్‌గా నియమితులైన తమీమ్ అన్సారీయా శనివారం మధ్యాహ్నం బాధ్యతలు చేపట్టనున్నారు. ఇటీవల జరిగిన IAS బదిలీల్లో ఈమె ప్రకాశం జిల్లా కలెక్టర్‌గా పనిచేస్తూ నేడు గుంటూరుకు రానున్నారు. ఇటీవలే జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాత్సవను గుంటూరు జిల్లాకు బదిలీ చేశారు. జిల్లాకు నూతన కలెక్టర్, జేసీల కాంబినేషన్‌లో పాలన కొనసాగనుంది. 38 ఏళ్లలో జిల్లాకు మూడో మైనారిటీ వర్గానికి చెందిన కలెక్టర్.

News September 12, 2025

నాగార్జున యూనివర్సిటీలో క్యాంపస్ డ్రైవ్

image

ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ ఆధ్వర్యంలో శుక్రవారం క్యాంపస్ డ్రైవ్ నిర్వహించారు. సైన్స్, ఇంజినీరింగ్ కళాశాలల్లోని వివిధ ల్యాబ్‌లలో ఈ కార్యక్రమం జరిగింది. ఎమ్మెస్సీ బయోటెక్నాలజీ, మైక్రో బయాలజీ, బయో కెమిస్ట్రీ కోర్సుల విద్యార్థులకు క్యాంపస్ డ్రైవ్‌లో పాల్గొనే అవకాశం కల్పించారు. ఈ నెల 16, 17 తేదీల్లో విద్యార్థులకు ఇంటర్వ్యూలు జరుగుతాయని వర్సిటీ అధికారులు తెలిపారు.

News September 12, 2025

తెనాలి: ఆయేషా మీరా తల్లిదండ్రులకు CBI నోటీసులు

image

ఆయేషా మీరా హత్య కేసులో ఆమె తల్లిదండ్రులకు సీబీఐ నోటీసులు పంపింది. ఈ నెల 19న విజయవాడ సీబీఐ కోర్టులో హాజరు కావాల్సిందిగా నోటీసులలో పేర్కొంది. దీనిపై ఆయేషా మీరా తల్లిదండ్రులు శంషాద్ బేగం, ఇక్బాల్ భాష ఆవేదన వ్యక్తం చేస్తూ నోటీసులను తిరస్కరించారు. 18 ఏళ్లుగా న్యాయం కోసం పోరాడుతున్నామని, బాధితులైన తమను ఎన్నిసార్లు కోర్టుకు తిప్పుతారని తల్లి శంషాద్ బేగం వాపోయారు.