News October 27, 2025

పల్నాడు: ‘ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా చూడాలి’

image

తుపాన్ కారణంగా జిల్లాలో ఎటువంటి ప్రాణ, ఆస్థి నష్టం జరగకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కృత్తికా శుక్లా అధికారులను ఆదేశించారు. తుపాన్ తీవ్రతపై ముందస్తుగా తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో ఆమె టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. శిథిలావస్థలో ఉన్న భవనాలు, ఇళ్లల్లోని వ్యక్తులు, లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలన్నారు. అన్ని మండలాలలో కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేయాలన్నారు.

Similar News

News October 27, 2025

నల్గొండ: మహిళలకు గుడ్ న్యూస్

image

నల్గొండ శివారు రాంనగర్‌లోని SBI గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థలో గ్రామీణ నిరుద్యోగ స్త్రీలకు టైలరింగ్‌లో 31 రోజుల ఉచిత శిక్షణ ఇస్తున్నామని సంస్థ డైరెక్టర్ రఘుపతి తెలిపారు. శిక్షణలో ఉచిత టూల్ కిట్, భోజనం వసతి, షెల్టర్ ఇస్తామన్నారు. 18 సం. నుంచి 45 లోపు ఉమ్మడి నల్గొండకు చెందిన వారు అర్హులన్నారు. ఆసక్తి గల వారు అక్టోబర్ 29 వరకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

News October 27, 2025

విజయవాడ: తుపాను ప్రభావంపై కలెక్టరేట్‌లో సమీక్ష

image

కలెక్టర్ లక్ష్మీశా, సీపీ రాజశేఖర్‌బాబుతో పాటు వివిధ శాఖల అధికారులు సోమవారం తుపాను అప్రమత్తతపై సమీక్ష సమావేశం నిర్వహించారు. తుపాను ప్రభావం తగ్గేవరకు వరి, పత్తి, మినుము, పెసర కోతలు చేయొద్దని కలెక్టర్ రైతులకు విజ్ఞప్తి చేశారు. కలెక్టరేట్‌తో పాటు డివిజన్, మండలం స్థాయిలోనూ కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేశారు. అన్ని శాఖల సమన్వయంపై కలెక్టర్ చర్చలు జరిపారు.

News October 27, 2025

సీఎంతో ఫోన్‌లో మాట్లాడిన ప్రధాని మోదీ

image

AP: రాష్ట్రానికి మొంథా తుఫాను ముప్పు ఉన్న నేపథ్యంలో CM CBNతో PM మోదీ ఫోనులో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం PMOతో సమన్వయం చేసుకోవాలని మంత్రి లోకేశ్‌కు CM సూచించారు. వర్షాలు, వరదలకు అవకాశం ఉన్న ప్రాంతాల్లో ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు. కాల్వ గట్లు పటిష్ఠం చేసి పంట నష్టం జరగకుండా చూడాలని ఆదేశించారు. ఈ మేరకు నిర్వహించిన సమీక్షలో మంత్రులు లోకేశ్, అనిత, CS తదితరులు పాల్గొన్నారు.