News March 28, 2025

పల్నాడు: ఫ్యాప్టో ఛైర్మన్‌గా రామిరెడ్డి ఎన్నిక

image

పల్నాడు జిల్లా ఫ్యాప్టో ఛైర్మన్‌గా ఎల్వీ రామిరెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘాల సమైక్య సమావేశాన్ని శుక్రవారం నిర్వహించారు. ఉపాధ్యాయుల సమస్యల పరిష్కార దిశగా సేవలందించడం జరుగుతుందని రామిరెడ్డి తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలో ఉత్తమ విద్యా బోధనతో పాటు, ఉపాధ్యాయుల సంక్షేమం కొనసాగే విధంగా తనకు వచ్చిన ఈ అవకాశాన్ని వినియోగిస్తానని చెప్పారు. అనంతరం ఉపాధ్యాయులు ఆయనకు అభినందనలు తెలిపారు.

Similar News

News September 18, 2025

GNT: సీజనల్ వ్యాధుల సమాచారానికి కంట్రోల్ రూమ్

image

సీజనల్ వ్యాధుల సమాచారానికి కలెక్టరేట్‌లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా తెలిపారు. ప్రస్తుత వాతావరణ మార్పుల దృష్ట్యా గుంటూరు జిల్లాలో అంటు వ్యాదులు ప్రభలే అవకాశాలు ఉన్నాయని,  ప్రజలందరూ అప్రమత్తతతో ఉండాలని కోరారు. ఈ మేరకు గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో 0863- 2234014  నంబరుతో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని చెప్పారు.

News September 18, 2025

రాజమండ్రి: నూతన కలెక్టర్‌ను కలిసిన జిల్లా ఎస్పీ

image

తూ.గో జిల్లా కలెక్టర్‌ కీర్తి చేకూరిని గురువారం రాజమండ్రి కలెక్టరేట్‌లో జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్‌ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆమెకు పూలగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు. జిల్లా అభివృద్ధి, శాంతి భద్రతలపై ఇరువురు చర్చించుకున్నారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు కలిసి పనిచేస్తామని వారు పేర్కొన్నారు.

News September 18, 2025

బతుకమ్మ వేడుకలు.. దద్దరిల్లనున్న ట్రై సిటీ!

image

బతుకమ్మ వేడుకలకు వరంగల్ ట్రై సిటీ సిద్ధమవుతోంది. గ్రేటర్ వరంగల్ పరిధిలోని వేయి స్తంభాల గుడి, భద్రకాళి, పద్మాక్షమ్మ గుట్ట, ఉర్సు రంగలీలా మైదానం, చిన్న వడ్డేపల్లి చెరువు, శివనగర్ గ్రౌండ్, మెట్టుగుట్ట, మడికొండ చెరువు, బెస్తం చెరువు, తోట మైదానం, డబ్బాల్ హనుమాన్ గుడి, బంధం చెరువు, కాశిబుగ్గ శివాలయం, కట్టమల్లన్న చెరువు వద్ద వేడుకలు ఘనంగా జరుగుతాయి. వీటిలో మీరు ఏ ప్రాంతానికి వెళ్తున్నారో కామెంట్ చేయండి.