News September 10, 2025
పల్నాడు: ఫ్రెండ్స్ మధ్య గొడవ.. గన్‌తో కాల్చేశాడు..!

చిలకలూరిపేటకు చెందిన దివ్వెల దీపక్ (22)ను నోయిడాలో అతని స్నేహితుడు దేవాన్ష్ పిస్టల్‌తో కాల్చి చంపాడు. మంగళవారం హాస్టల్ గదిలో ఇద్దరి మధ్య గొడవ జరగగా, దేవాన్ష్ తన లైసెన్సుడు పిస్టల్‌తో దీపక్ నుదుటిపై కాల్చాడు. ఆ తర్వాత దేవాన్ష్ కూడా ఆత్మహత్యా ప్రయత్నం చేశాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News September 10, 2025
సంగారెడ్డి: ‘స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం కావాలి’

రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు బీజేపీ కార్యకర్తలు సిద్ధం కావాలని జిల్లా అధ్యక్షురాలు గోదావరి అంజిరెడ్డి అన్నారు. సంగారెడ్డిలోని పార్టీ కార్యాలయంలో బుధవారం సమావేశం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలకు వివరించాలని చెప్పారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని విమర్శించారు.
News September 10, 2025
BREAKING: కూకట్‌పల్లిలో మహిళ హత్య

HYD కూకట్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈరోజు దారుణం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు.. స్థానిక స్వాన్ లేక్ అపార్ట్‌మెంట్‌లో రేణు అగర్వాల్ (50) అనే మహిళను గుర్తు తెలియని దుండగులు హత్య చేశారు. ఆమె కాళ్లు, చేతులు కట్టేసి ఈ ఘాతుకానికి పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. కూకట్‌పల్లి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. ఈ హత్యకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.