News March 29, 2025
పల్నాడు: మాతృ మరణాలపై ప్రత్యేక సమావేశం

పల్నాడు జిల్లాలో మాతృ మరణాలపై ప్రత్యేక సమావేశాన్ని జాయింట్ కలెక్టర్ సూరజ్ గనూరే ఆధ్వర్యంలో నిర్వహించారు. వారు మాట్లాడుతూ.. గర్భిణీలకు శ్రద్ధతో వైద్య పరీక్షలను అందించాలన్నారు. జిల్లాలో ఎడ్లపాడు, సిరిగిరిపాడు, ఆరేపల్లి, ముప్పాళ్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో జరిగిన మాతృ మరణాల గురించి చర్చించారు. రక్తహీనత సమస్యలు ఉంటే వెంటనే వైద్యం అందించాలని, ప్రసవ సమయంలోను జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు.
Similar News
News March 31, 2025
HYD: కోడి పందాల స్థావరంపై దాడులు

కోడి పందాలు ఆడుతున్నారన్న సమాచారంతో పేట్ బషీరాబాద్ పోలీసులు దాడి చేసి ఆరుగురిని అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాలిలా.. మున్సిపాలిటీ పరిధి దేవరయాంజాల్‌లోని బాల్ రెడ్డి తోటలోని కోడి పందాలు ఆడుతున్న స్థావరంపై సోమవారం సాయంత్రం పోలీసులు దాడులు చేశారు. ఆరుగురిని అదుపులోకి తీసుకోగా, 2 కోడి పుంజులు, 15 కోడి కత్తులు, 7 ఫోన్లు, 3 బైకులు, 26వేల నగదు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
News March 31, 2025
విశాఖ స్టీల్‌ప్లాంట్‌కు పూర్వ వైభవం తేవాలి: సీఎం

AP: సీఎం చంద్రబాబుతో కేంద్ర మంత్రి శ్రీనివాసవర్మ, ఉక్కుశాఖ అధికారులు సమావేశమయ్యారు. విశాఖ స్టీల్ ప్లాంట్‌కు ప్యాకేజీ ప్రకటన, బ్లాస్ట్ ఫర్నేస్ తదితర అంశాలపై చర్చించారు. ఉక్కు కర్మాగారానికి, ప్రజలకు భావోద్వేగ అనుబంధం ఉందని సీఎం అన్నారు. దానికి పూర్వ వైభవం తెచ్చేందుకు నిర్వహణ వ్యయం తగ్గించుకోవాలని సూచించారు. ఫ్యాక్టరీకి SPFతో భద్రత కల్పిస్తామన్న సీఎంకు శ్రీనివాసవర్మ ధన్యవాదాలు తెలిపారు.
News March 31, 2025
నర్వలో పేకాట రాయులు అరెస్ట్

నర్వ గ్రామ శివారులో పేకాడుతున్న ఆరుగురిని అరెస్టు చేసినట్లు ఎస్ఐ, కుర్మయ్య తెలిపారు. నమ్మదగిన సమాచారం మేరకు సోమవారం గ్రామ శివారులో బోయపాటి నర్సింహులు పొలం దగ్గర రహస్యంగా పేకాడుతున్న ఆరుగురిని పట్టుకొని వారి దగ్గరి నుంచి రూ.1,080, నాలుగు సెల్ఫోన్లు, నాలుగు బైకులు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు.