News March 14, 2025

పల్నాడు: రేపటి నుంచి ఒంటి పూట బడులు

image

పల్నాడు జిల్లాలో రేపటి నుంచి ఒంటిపూట బడులను అమలు చేస్తున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారిణిచంద్రకళ శుక్రవారం తెలిపారు. ఏప్రిల్ 23 వరకు ప్రభుత్వ, ప్రైవేటు బడుల్లో ఉదయం 7:45 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు తరగతులు జరుగుతాయన్నారు. 10వ తరగతి పరీక్షలు జరిగే పాఠశాలల్లో పరీక్షలు ముగిసే వరకు మధ్యాహ్నం 1:15 నుంచి 5 గంటల వరకు తరగతులు జరుగుతాయన్నారు. కచ్చితంగా ప్రైవేటు పాఠశాలల్లో ఒంటిపూట బడులు అమలు చేయాలన్నారు.

Similar News

News November 7, 2025

హెక్టారుకు ₹50,000 ఆర్థికసాయం: అచ్చెన్న

image

AP: రేట్లు లేక నష్టపోయిన ఉల్లి రైతులకు త్వరలోనే హెక్టారుకు ₹50వేల చొప్పున ఆర్థిక సాయం అందిస్తామని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. కర్నూలు, కడప జిల్లాల్లో 20,913 మంది రైతులకు ₹104.57 కోట్ల సాయం అందుతుందన్నారు. ధరలు పడిపోయినప్పుడు క్వింటాలుకు ₹1,200 చొప్పున ₹18కోట్ల సరకు కొనుగోలు చేశామని గుర్తుచేశారు. ఇప్పటికే ₹10 కోట్లు ఇచ్చామని, మరో ₹8కోట్లు త్వరలో చెల్లిస్తామని పేర్కొన్నారు.

News November 7, 2025

రాజోలు: అండర్ 14 క్రికెట్ జట్టుకు రితీశ్ రాజ్ ఎంపిక

image

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా క్రీడా సమాఖ్య ఆధ్వర్యంలో గురువారం జరిగిన ఎంపిక కార్యక్రమంలో మలికిపురానికి చెందిన బత్తుల రితీశ్ రాజ్ అండర్-14 క్రికెట్ జట్టుకు ఎంపికయ్యారుడు. ఈ సందర్భంగా దళిత చైతన్య వేదిక నాయకులు రితీశ్ రాజ్‌ను అభినందించారు. భవిష్యత్తులో మరింత ఉన్నత స్థానానికి ఎదగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ నాయకులు పాలమూరి శ్యాంబాబు, బత్తుల మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

News November 7, 2025

SBI అరుదైన ఘనత

image

మార్కెట్ విలువలో 100 బిలియన్ డాలర్ల(రూ.8.8 లక్షల కోట్లు) కంపెనీగా SBI నిలిచింది. ఈ ఘనత సాధించిన ఆరో భారత కంపెనీగా, తొలి ప్రభుత్వ రంగ సంస్థగా రికార్డు సృష్టించింది. నిన్న SBI షేరు జీవితకాల గరిష్ఠం రూ.971.15కు చేరడంతో ఈ ఘనత సాధ్యమైంది. ఈ జాబితాలో ఇప్పటి వరకు రిలయన్స్, HDFC బ్యాంక్, భారతీ ఎయిర్‌టెల్, టీసీఎస్, ICICI బ్యాంక్ ఉన్నాయి.