News October 27, 2025
పల్నాడు: ‘రేపు విద్యా సంస్థలకు సెలవు’

జిల్లాలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున, జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలకు, అంగన్‌వాడీ పాఠశాలలు, కళాశాలలకు ఈ నెల 28వ తేదీని సెలవు ప్రకటిస్తున్నట్లు కలెక్టర్ కృతికా శుక్లా తెలిపారు. మొంథా తుఫాను కారణంగా ఎలాంటి ప్రాణనష్టం జరగకుండా నివారించే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆమె పేర్కొన్నారు.
Similar News
News October 27, 2025
ఖమ్మంలో పారదర్శకంగా మద్యం షాపుల కేటాయింపు

ఖమ్మం జిల్లాలో 116 ఏ4 మద్యం షాపుల కేటాయింపును లాటరీ విధానంలో అత్యంత పారదర్శకంగా నిర్వహించినట్లు కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. మొత్తం 4,430 దరఖాస్తులు అందగా, దరఖాస్తుదారుల సమక్షంలో లక్కీ డ్రా తీశారు. రిజర్వేషన్ ప్రకారం గౌడలకు 18, ఎస్సీలకు 14, ఎస్టీలకు 8 షాపులు కేటాయించారు. లాటరీ ప్రక్రియను పూర్తిస్థాయిలో వీడియోగ్రఫీ చేసినట్లు కలెక్టర్ తెలిపారు.
News October 27, 2025
చీరాల మున్సిపల్ కార్యాలయంలో అధికారులతో సమావేశం

చీరాల మున్సిపల్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ చీరాల ఎమ్మెల్యే ఎంఎం కొండయ్య, మున్సిపల్ కమిషనర్ రషీద్ ఆర్డీఓ చంద్రశేఖర్ ఆధ్వర్యంలో తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో అధికారులతో సమావేశం నిర్వహించారు. పునరావాస కేంద్రాల ఏర్పాటు చర్చించారు లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు పాల్గొన్నారు.
News October 27, 2025
ఈ జిల్లాల్లో కాలేజీలకు సెలవు

AP: తుఫాను నేపథ్యంలో స్కూళ్లతో పాటు పలు జిల్లాల్లోని జూనియర్ ఇంటర్ కాలేజీలకు అధికారులు సెలవులు ప్రకటించారు. అనకాపల్లి, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల్లోని కాలేజీలకు ఈ నెల 29 వరకు సెలవులు ఇచ్చారు. పశ్చిమ గోదావరి, ఏలూరు, బాపట్ల, కడప జిల్లాల్లో రేపు హాలిడే ఉండనుంది. కాకినాడలో 31 వరకు సెలవులు ప్రకటించారు. మిగతా జిల్లాల్లో యథావిధిగా కాలేజీలు నడవనున్నాయి.


