News October 28, 2025
పల్నాడు: రేపు విద్యా సంస్థలకు సెలవు

తుఫాను కారణంగా పల్నాడు జిల్లాలో 29వ తేదీన అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున, కలెక్టర్ కృతికా శుక్లా కీలక ప్రకటన చేశారు. ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా ముందు జాగ్రత్త చర్యగా, జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలు, అంగన్‌వాడీ పాఠశాలలు, కళాశాలలకు సెలవు ప్రకటిస్తున్నట్లు ఆమె తెలిపారు. అందరూ అప్రమత్తంగా ఉండాలని అన్నారు.
Similar News
News October 29, 2025
HYD: తెలుగు వర్సిటీ.. నేడు సాహితీ పురస్కారాల ప్రదానం

బాచుపల్లిలోని సురవరం ప్రతాపరెడ్డి తెలుగు వర్సిటీలో 2023 సంవత్సరానికి గాను సాహితీ పురస్కారాలకు 11 మంది ఎంపికైనట్లు వర్సిటీ రిజిస్ట్రార్ ఆచార్య కోట్ల హనుమంతరావు తెలిపారు. ఈనెల 29న నాంపల్లి ప్రాంగణంలో ఈ పురస్కారాలు ప్రదానం చేస్తామని, పురస్కారాల గ్రహీతలకు ఒక్కొక్కరికి రూ.20,116 నగదు అందజేసి సత్కరిస్తామన్నారు. 2020, 2021, 2022 సంవత్సరాల్లో వెలువడ్డ పుస్తకాలను సేకరించి పురస్కారాల ఎంపిక చేశామన్నారు.
News October 29, 2025
30 ఇంజినీర్ పోస్టులు.. అప్లైకి ఇవాళే లాస్ట్ డేట్

హైదరాబాద్‌లోని భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(BEL)లో 30 పోస్టులకు అప్లై చేయడానికి ఇవాళే ఆఖరు తేదీ. టెన్త్, ఐటీఐ, డిప్లొమా ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం గలవారు అప్లై చేసుకోవచ్చు.. అభ్యర్థుల గరిష్ఠ వయసు 28ఏళ్లు. రిజర్వేషన్ గల అభ్యర్థులకు ఏజ్‌లో సడలింపు ఉంది. దరఖాస్తు ఫీజు రూ.590, SC,ST,దివ్యాంగులకు ఫీజు నుంచి మినహాయింపు కలదు. రాత పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://bel-india.in/
News October 29, 2025
సహజ సేద్యంతో ఎక్కువ లాభం.. ఎందుకంటే?

వ్యవసాయంలో సహజ సేద్య పద్ధతుల వైపు నేడు చాలా మంది రైతులు ఆసక్తి చూపిస్తున్నారు. దీనికి కారణం ఈ విధానంలో పెట్టుబడి ఖర్చు తగ్గడమే. సహజ సేద్యంలో లాభాలు తొలుత ఆలస్యమైనా, కొంత కాలానికి సంప్రదాయ పద్ధతుల్లో వ్యవసాయం చేస్తున్న రైతులతో సమానంగా ఆదాయం వస్తుంది. క్రిమిసంహారక మందులు, ఎరువులపై వెచ్చించే వ్యయం తగ్గడంతో పాటు పర్యావరణానికి, మన ఆరోగ్యానికి మేలు జరుగుతుంది. మహిళలు ఎక్కువగా ఈ విధానం అనుసరిస్తున్నారు.


