News November 17, 2025
పల్నాడు: రైల్వే సమస్యల పరిష్కారానికి ఎంపీ వినతి

MP శ్రీకృష్ణ దేవరాయలు పల్నాడు (D) పరిధిలోని పలు రైల్వే సమస్యలను పరిష్కరించాలని సౌత్ సెంట్రల్ రైల్వే GM సంజయ్ కుమార్ శ్రీవాస్తవను కోరారు. సోమవారం సికింద్రాబాద్‌లో GMను కలిసిన MP, తమ వినతి పత్రం సమర్పించారు. ముఖ్యంగా, పల్నాడు ప్రాంతంలో ఆలస్యంగా రాత్రి వేళలో ప్రయాణించే రైల్వే ప్రయాణికులకు భద్రత సౌకర్యాలను మెరుగుపరచడంపై దృష్టి సారించాలన్నారు. GM ఈ సమస్యలపై సానుకూలంగా స్పందించారని MP తెలిపారు.
Similar News
News November 17, 2025
భూపాలపల్లి: విషాదం.. 7 నెలల గర్భిణి ఆత్మహత్య

భూపాలపల్లి(D) గణపురం(M) బుద్ధారంలో సోమవారం విషాదం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు.. కరీంనగర్(D) ఇల్లందకుంట మండలానికి చెందిన మౌనిక(23)కు రెండేళ్ల క్రితం ఇక్కడి యువకుడు ప్రశాంత్‌తో వివాహమైంది. అదనపు కట్నం కోసం భర్త, కుటుంబ సభ్యులు నిరంతరం వేధిస్తున్నారు. వేధింపులు తట్టుకోలేక 7 నెలల గర్భిణిగా ఉన్న మౌనిక ఇంట్లో ఉరేసుకుని చనిపోయింది. మౌనిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.

గుంటూరు సౌత్ డివిజన్‌లో ప్రమాద ప్రాంతాల పరిశీలన

గుంటూరు సౌత్ సబ్-డివిజన్ డీఎస్పీ భానోదయ 12 ప్రమాద ప్రాంతాలను (బ్లాక్ స్పాట్స్) నల్లపాడు, ప్రతిపాడు పోలీస్ స్టేషన్ పరిధిలో పరిశీలించారు. లైటింగ్, హెచ్చరిక బోర్డులు, సీసీటీవీలు, వేగ నియంత్రణ చర్యలపై అధికారులతో సమీక్ష జరిపారు. పరిశీలన ఆధారంగా ప్రత్యేక రిపోర్టును ఎస్పీ వకుల్ జిందాల్, NHAIకు పంపనున్నట్లు తెలిపారు. ఎంవీఐ మల్లేశ్వరి, NHAI ఇంజినీర్ దత్తాత్రేయ, సీఐలు వంశీధర్, శ్రీనివాసరావు ఉన్నారు.