News April 3, 2025

పల్నాడు: వాయిదా పడిన డిగ్రీ పరీక్షలు

image

ఆచార్య నాగార్జున యూనివర్సిటీ(ANU) పరిధిలో 2025 ఏప్రిల్ 5న జరగనున్న డిగ్రీ 4వ సెమిస్టర్ రెగ్యులర్ & సప్లిమెంటరీ పరీక్షలు వాయిదాపడ్డాయి. 5వ తేదీన బాబు జగజ్జీవన్ రామ్ జయంతిని పురస్కరించుకుని పబ్లిక్ హాలిడే ప్రకటించినందున ఆ రోజు జరగాల్సిన 4వ సెమిస్టర్ పరీక్షలను ఈ నెల 15న మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు నిర్వహిస్తామని ANU పరీక్షల విభాగం తాజాగా ఓ ప్రకటన విడుదల చేసింది.

Similar News

News September 18, 2025

PDPL: ప్రీ- ప్రైమరీ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

image

పెద్దపల్లి జిల్లాలో కొత్తగా ప్రారంభించనున్న 12 ప్రీ- ప్రైమరీ పాఠశాలల్లో ఇన్‌స్ట్రక్టర్లుగా, ఆయాలుగా తాత్కాలిక పద్ధతిన పనిచేసేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి మాధవి బుధవారం తెలిపారు. ఇందుకు సెప్టెంబర్ 21లోపు అవకాశం ఉందన్నారు. ఇంటర్, 7వ తరగతి విద్యార్హతలతో 18- 44ఏళ్ల మధ్య వయస్సున్నవారు సంబంధిత HMలకు దరఖాస్తులు సమర్పించాలన్నారు. ఎంపికలో స్థానికులకు ప్రాధాన్యత ఉంటుందన్నారు.

News September 18, 2025

మహబూబాబాద్: ఐదుగురు పీఏసీఎస్ ఛైర్మన్‌‌లను తొలగించిన ప్రభుత్వం

image

మహబూబాబాద్ జిల్లాలో ఐదుగురు పీఏసీఎస్ ఛైర్మన్లను ప్రభుత్వం తొలగించింది. తొర్రూరు, నెల్లికుదురు, బయ్యారం, కేసముద్రం, కురవి సొసైటీల ఛైర్మన్లను తొలగించి, వారి స్థానంలో ప్రత్యేక అధికారులను నియమించింది. తొర్రూరుకు రమేశ్, బయ్యారానికి ఆదినారాయణ, నెల్లికుదురుకు మోహన్ రావు, కేసముద్రానికి ప్రవీణ్, కురవికి సుమలత ప్రత్యేక అధికారులుగా బాధ్యతలు స్వీకరించారు.

News September 18, 2025

సెప్టెంబర్ 18: చరిత్రలో ఈ రోజు

image

✒ 1883: ఫ్రీడమ్ ఫైటర్ మదన్ లాల్ ధింగ్రా(ఫొటోలో) జననం
✒ 1899: ఫ్రీడమ్ ఫైటర్, కవి గరికపాటి మల్లావధాని జననం
✒ 1950: నటి షబానా అజ్మీ జననం
✒ 1968: దక్షిణాది నటుడు ఉపేంద్ర జననం
✒ 1985: డైరెక్టర్ విజ్ఞేశ్ శివన్ జననం
✒ 1988: క్రికెటర్ మోహిత్ శర్మ జననం
✒ 1989: బ్యాడ్మింటన్ క్రీడాకారిణి అశ్విని పొన్నప్ప జననం
✒ ప్రపంచ నీటి పర్యవేక్షణ దినోత్సవం
✒ ప్రపంచ వెదురు దినోత్సవం