News May 12, 2024

పల్నాడు: విద్యుత్‌ షాక్‌‌తో యువ రైతు మృతి

image

ప్రమాదవశాత్తు విద్యుత్‌ షాక్‌ తగిలి యువ రైతు మృతి చెందిన సంఘటన ఈపూరు మండలంలోని శ్రీనగర్‌లో జరిగింది. గ్రామానికి చెందిన వేంపాటి పరమేశ్వరరెడ్డి (28) వ్యవసాయ బోరు మోటార్‌ కింద పొలం సాగు చేస్తున్నాడు. విద్యుత్‌ ట్రాన్స్‌ ఫార్మర్‌ వద్ద ఫీజులు వేసే క్రమంలో పైన ఉన్న 11 కె.వి విద్యుత్తు లైన్‌ తగిలి, కిందపడి తలకు తీవ్రగాయమై అక్కడికక్కడే మృతి చెందాడు. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.

Similar News

News December 29, 2025

2025 రివైండ్… గుంటూరు జిల్లాలో పాజిటివ్ న్యూస్

image

గుంటూరు జిల్లాకు రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు కలిపి సుమారు రూ.955 కోట్ల విలువైన మౌలిక వసతుల ప్రాజెక్టులకు ఆమోదం తెలిపాయి. రియల్‌ ఎస్టేట్ రంగంలో గుంటూరు దేశంలోనే వేగంగా ఎదుగుతున్న టియర్-2 నగరంగా నిలిచి, భూమి ధరలు 51 శాతం పెరిగాయి. ప్రజారోగ్య రంగంలో భాగంగా ప్రత్తిపాడులో రూ.150 కోట్లతో 100 పడకల ఈఎస్‌ఐ ఆసుపత్రి మంజూరైంది. అలాగే గుంటూరు కాలువ ఆధునీకరణకు రూ.400 కోట్లు కేటాయించారు.

News December 29, 2025

గుంటూరు జిల్లాలో 2025లో టాప్ కేసు ఇదే!

image

మంగళగిరి గ్రామీణ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన రూ.5 కోట్ల బంగారు దోపిడీ కేసు గుంటూరు జిల్లాలో 2025 సంవత్సరానికి టాప్–1 కేసుగా నిలిచింది. ఫిబ్రవరి 15న ఆత్మకూరు జంక్షన్ వద్ద జువెలరీ సిబ్బందిపై దాడి చేసి 4.9 కిలోల బంగారం అపహరించారు. సాంకేతిక ఆధారాలతో 9 మంది నిందితులను అరెస్ట్ చేసి, 4,814.42 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు ఛార్జ్‌షీట్ దాఖలుతో గుంటూరు జిల్లా పోలీసుల గుర్తింపు పొందారు.

News December 29, 2025

నేడు ప్రజా అర్జీలు స్వీకరించనున్న గుంటూరు కలెక్టర్

image

గుంటూరు కలెక్టరేట్ కార్యాలయంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించనున్నట్లు కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా ఆదివారం తెలిపారు. https://Meekosam.ap.gov.in లేదా తమకు నేరుగా అర్జీలు అందించవచ్చని చెప్పారు. డయల్ 1100 కి ఫోన్ చేసి సమర్పించిన అర్జీల స్థితిగతులను తెలుసుకోవచ్చని సూచించారు. ప్రతి వారం అర్జీలు అధికంగా వస్తున్న నేపథ్యంలో శాఖల వారీగా ప్రత్యేక నమోదు విభాగాలు అందుబాటులో ఉంటాయన్నారు.