News February 9, 2026

పల్నాడు: వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న కలెక్టర్, ఎస్పీ

image

సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన 3వ మంత్రులు-కార్యదర్శుల సదస్సుకు పల్నాడు జిల్లా యంత్రాంగం హాజరైంది. నరసరావుపేట కలెక్టరేట్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్ కృతికా శుక్లా, ఎస్పీ కృష్ణారావు ఈ సమావేశంలో పాల్గొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా పరిపాలనను వేగవంతం చేయడం, అభివృద్ధి పనుల పురోగతి, ప్రభుత్వ పథకాల అమలుపై ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు.

Similar News

News February 15, 2026

మదనపల్లెకు టమాటాలు రావడం లేదు..!

image

మదనపల్లె మార్కెట్‌కు రైతులు టమాటాలు తీసుకు రావడమే మానేశారు. బయట రాష్ట్రాల్లోనూ పంటలు పడటం, రేట్లు తక్కువగా ఉండటంతో వ్యాపారులు అక్కడే కొనుగోలు చేస్తున్నారు. ఆదివారం 35వేల కిలోల టమాటా మాత్రమే వచ్చింది. 10కిలోల మొదటి రకం రూ.190, రెండో రకం రూ.180, మూడో రకం రూ.160తో అమ్ముడుపోయాయి.

News February 15, 2026

రైతుభరోసా ఒకే విడతలో.. ?

image

TG: గతంలో మాదిరి కాకుండా ఈసారి ప్రభుత్వం ఒకే విడతలో రైతుభరోసా నిధులను విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు ఎకరాల చొప్పున డబ్బులు విడుదల చేయడంతో మొత్తం ప్రక్రియ పూర్తయ్యేసరికి 9 రోజుల సమయం పట్టేది. ఈసారి పెట్టుబడికి రైతులు ఎదురుచూడాల్సిన అవసరం లేకుండా ఒకే విడతలో ఖాతాల్లో డిపాజిట్ చేయనున్నట్లు సమాచారం. కాగా ఈ నెల 17న రైతుభరోసా నిధులు విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది.

News February 15, 2026

కాంగ్రెస్‌లో చేరిన ఐదుగురు కొత్తగూడెం స్వతంత్ర కార్పొరేటర్లు

image

కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థులుగా విజయం సాధించిన ఐదుగురు కార్పొరేటర్లు ఆదివారం కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సమక్షంలో వీరు కాంగ్రెస్‌లో చేరగా, వారికి మంత్రి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. పార్టీలో చేరిన వారిలో 1, 13, 34, 42, 48వ డివిజన్ల కార్పొరేటర్లు సుగుణ, తలుగు శాంత, విజయలక్ష్మి, మణి, నరేష్ ఉన్నారు.