News November 21, 2025

పల్నాడు వీరుల ఉత్సవాలలో నేడు మందపోరు

image

పల్నాడు వీరుల ఉత్సవాలలో మూడవ రోజు శుక్రవారం మందపోరు నిర్వహించనున్నారు. మలిదేవ, బ్రహ్మన్న పరివారం అరణ్యవాస సమయంలో నల్లమల మండాది ప్రాంతంలో ఆవులను మేపేవారు. కుట్రతో నాగమ్మ వర్గీయులు ఆవులను వధిస్తారు. ఆవులు రక్షించుకునేందుకు లంకన్న భీకర యుద్ధం చేసి వీర మరణం పొందుతాడు. దీంతో బ్రహ్మనాయుడు ఆగ్రహం కట్టలు తెచ్చుకుంటుంది. నాడు కుల మతాలకు అతీతంగా బ్రహ్మనాయుడు చేపట్టిన చాప కూడు సిద్ధాంతం నేటికీ కొనసాగుతోంది.

Similar News

News November 22, 2025

భద్రాద్రి: ‘హిడ్మాను పట్టుకొని చంపేశారు’

image

మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు మడ్వి హిడ్మా, ఆయన సహచరి రాజేలను పోలీసులు ప్రాణాలతో పట్టుకొని చిత్రహింసలు పెట్టి చంపేశారని, ఆ తర్వాతే ఎన్‌కౌంటర్ పేరిట కట్టుకథలు చెబుతున్నారని మావోయిస్టు కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్ పేరిట లేఖ విడుదలైంది. హిడ్మా హత్యను నిరసిస్తూ, ఈ నెల 23న దేశవ్యాప్తంగా బంద్‌ పాటించాలని కేంద్ర కమిటీ పిలుపునిచ్చింది. నవంబరు 20న రాసిన ఈ లేఖ శుక్రవారం వెలుగులోకి వచ్చింది.

News November 22, 2025

HYD: బీసీ కమిషన్‌ రిపోర్ట్‌కు కేబినెట్‌ ఆమోదం

image

తెలంగాణలో బీసీ డెడికేటెడ్‌ కమిషన్‌ నివేదికను రాష్ట్ర కేబినెట్ ఆమోదించింది. ఈ నివేదిక ఆధారంగా పంచాయతీ రాజ్‌ శాఖ నేడు జీవోను విడుదల చేయనుంది. జిల్లా కలెక్టర్లు నవంబర్ 23వ తేదీ సాయంత్రం 6 గంటలలోగా రిజర్వేషన్లను ఖరారు చేయాలని ఆదేశించారు. పూర్తి నివేదికను పంచాయతీ రాజ్‌ శాఖ నవంబర్ 24వ తేదీన కోర్టుకు సమర్పించనుంది. ఈ నిర్ణయం ద్వారా రిజర్వేషన్ల ప్రక్రియ త్వరగా పూర్తవుతుందని భావిస్తున్నారు.

News November 22, 2025

విప్లవోద్యమాన్ని కాపాడుకుందాం: మావోయిస్ట్ పార్టీ

image

డిసెంబర్ 2 నుంచి 8 వరకు ప్రజా విముక్తి గెరిల్లా సైన్యం (PLGA) 25వ వార్షికోత్సవాలను దేశవ్యాప్తంగా నిర్వహించాలని CPI(మావోయిస్టు) సెంట్రల్ మిలిటరీ కమిషన్ పిలుపునిచ్చింది. కగార్ యుద్ధం నుంచి పార్టీని, PLGAని, ప్రజా సంఘాలను, విప్లవోద్యమాన్ని కాపాడుకుందామని కోరింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా పోరాటాన్ని తీవ్రతరం చేద్దామని పేర్కొంది. 11 నెలల్లో 320 మంది కామ్రేడ్స్ అమరులయ్యారని తెలిపింది.