News November 20, 2025
పల్నాడు వీర్ల గుడిని నిర్మించింది ముస్లింలని మీకు తెలుసా.?

పల్నాడు వీర్ల గుడిని ఔరంగజేబు సైన్యాధిపతులుగా పనిచేసిన జాఫర్, ఫరీదులు నిర్మించినట్లు చరిత్ర చెబుతోంది. నాగులేరు ఒడ్డున గుండ్రాయిలను పొయ్యి కింద వాడుకోగా, ఆగ్రహించిన చెన్నకేశవ స్వామి అవి వీరుల రూపాలని చెప్పాడు. ప్రాయశ్చిత్తంగా వీరుల గుడిని నిర్మించిన ఆ ఇద్దరు సైన్యాధిపతులు, తాము కూడా పూజలు అందుకోవాలనే కోరికతో వీర్ల గుడిలోనే సమాధి అయ్యారు. వారి సమాధులు నేటికీ గుడిలో ఉండటం ఇక్కడి విశేషం.
Similar News
News April 14, 2026
అడ్వకేట్ సుబ్బారావుపై సీపీ సజ్జనార్‌కు మంగ్లీ ఫిర్యాదు

తనపై ఎలాంటి ఆధారాలు లేకుండా దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపిస్తూ అడ్వకేట్ సుబ్బారావుపై కఠినచర్యలు తీసుకోవాలని సింగర్ మంగ్లీ పోలీసులను ఆశ్రయించారు. ఈ మేరకు సీపీ సజ్జనార్‌ను కలిసి ఆమె ఫిర్యాదు అందజేశారు. తనపై తప్పుడు ఆరోపణలు చేసి వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేలా ప్రచారం చేస్తున్నారని అందులో పేర్కొన్నారు. ఇలాంటి దుష్ప్రచారాలను అరికట్టేందుకు చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సీపీని కోరారు.
News April 14, 2026
TPG: రోడ్డు ప్రమాదంలో గుర్తు తెలియని వ్యక్తి మృతి

రోడ్డు ప్రమాదంలో గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందినట్లు రూరల్ పోలీసులు మంగళవారం తెలిపారు. ఈ సంఘటన తాడేపల్లిగూడెం మండలం పడాల ఒక పత్రిక కార్యాలయం వద్ద చోటు చేసుకుంది. గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో ఈ ప్రమాదం సంభవించినట్లు వివరించారు. మృతుని ఆచూకీ తెలిసిన వారు తాడేపల్లిగూడెం రూరల్ పోలీస్ స్టేషన్‌లో సంప్రదించాలని కోరారు.
News April 14, 2026
TU: M.Ed మొదటి సెమిస్టర్ పరీక్షల షెడ్యూల్ విడుదల

తెలంగాణ విశ్వవిద్యాలయం పరిధిలో ఏం.ఈడి మొదటి సెమిస్టర్ పరీక్షల షెడ్యూల్‌ను సోమవారం సాయంత్రం విడుదల చేసినట్లు పరీక్షల నియంత్రణ అధికారి ఆచార్య సంపత్ కుమార్ వెల్లడించారు. ఈ నెల 24 నుంచి 30వరకు నిర్వహించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ నెల 24 నుంచి 28 వరకు మధ్యాహ్నం 2-5 గం.ల వరకు, 29, 30 తేదీల్లో నిర్వహించే పరీక్షలు మధ్యాహ్నం 2- 3.30 గం.ల వరకు జరుగుతాయని తెలిపారు. వివరాలకు వర్సిటీ వెబ్‌సైట్ చూడాలన్నారు.


