News December 19, 2025

పల్నాడు: సచివాలయాల్లో ముఖ ఆధారిత హాజరు

image

సచివాలయాల వ్యవస్థను పటిష్టం చేసే దిశగా ప్రభుత్వం కీలక అడుగు వేసింది. జిల్లాలోని సచివాలయ ఉద్యోగులకు ముఖ ఆధారిత హాజరు విధానాన్ని శుక్రవారం ప్రారంభించారు. ఉద్యోగులు విధులకు హాజరయ్యే సమయంలో ఎటువంటి అవకతవకలకు తావులేకుండా, పక్కాగా పర్యవేక్షించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. నిర్ణీత సమయానికి కార్యాలయానికి వస్తున్నారా.? ప్రజలకు అందుబాటులో ఉంటున్నారా.? లేదా.? అన్న అంశాలను అధికారులు పరిశీలించనున్నారు.

Similar News

News December 25, 2025

BREAKING మైదుకూరు: RTC బస్సు నుంచి దూకిన యువతి.!

image

ఆళ్లగడ్డ- మైదుకూరు RTC బస్సు నుంచి యువతి దూకి గాయపడిన ఘటన బుధవారం రాత్రి చోటుచేసుకుంది. ప్రయాణికుల వివరాల మేరకు.. మైదుకూరు శ్రీరామ్ నగర్‌కు చెందిన ఓ యువతి తన స్టాప్ రాగానే బస్సును ఆపాలని కోరగా డ్రైవర్ ఆపలేదు. దీంతో యువతి ఒక్కసారిగా బస్సు నుంచి దూకి గాయపడింది. కాగా బస్సు డ్రైవర్ బస్సును ఆపి పరారైనట్లు సమాచారం. ఘటన స్థలానికి RTC అధికారులు చేరుకొని విచారణ చేపట్టారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News December 25, 2025

జనగామ జిల్లాలో నేటి టాప్ న్యూస్!

image

> రాష్ట్రస్థాయి పోటీలకు ఏడునూతుల విద్యార్థి ఎంపిక
> దేవరుప్పుల: కొడుకు జ్ఞాపకార్థం హాస్పిటల్‌కు భూమి విరాళం
> రాష్ట్ర ఐఎంఏ యాక్షన్ కమిటీ సభ్యుడిగా లక్ష్మీనారాయణ నాయక్
> కడియం బీఆర్ఎస్ ఎమ్మెల్యే అంటూ ఫ్ల కార్డులతో స్వాగతం
> జనగామ: ఎగతాళి చేశారు.. సర్పంచ్‌గా గెలిచింది!
> జనగామ: ఉపాధి హామీ చట్టాన్ని రద్దు చేయాలని నిరసన
> పాలకుర్తి: అక్రమంగా తరలిస్తున్న పీడీఎస్ బియ్యం పట్టివేత

News December 25, 2025

తగ్గేదేలే.. లీడర్స్ ON FIRE

image

తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన పార్టీల నాయకులు ఫైర్ మీదున్నారు. ప్రత్యర్థులను లక్ష్యంగా చేసుకొని విమర్శలు చేయడంలో ఎవరూ తగ్గడం లేదు. AP సీఎం చంద్రబాబు, జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ YCP నేతలకు <<18625628>>వార్నింగ్స్<<>> ఇస్తుండగా, జగన్ సైతం బయటకు వచ్చినప్పుడల్లా ప్రత్యర్థులను లక్ష్యంగా చేసుకొని ఫైరవుతున్నారు. ఇటు తెలంగాణలోనూ సీఎం రేవంత్, BRS చీఫ్ కేసీఆర్, KTR, హరీశ్ రావు <<18660564>>విమర్శలతో<<>> రాజకీయాలను హీటెక్కిస్తున్నారు.