News October 9, 2025
పల్నాడు: సచివాలయ ఉద్యోగినిపై అత్యాచార యత్నం: ఎస్ఐ

ఎడ్లపాడు (M)కారుచోల సచివాలయంలో పనిచేసే ఓ ఉద్యోగినిపై అదే గ్రామానికి చెందిన తిరుపతయ్య అత్యాచారయత్నానికి పాల్పడ్డాడని PSలో కేసు నమోదైంది. SI శివరామకృష్ణ వివరాల మేరకు..తిరుపతయ్య తన దూడ ఆరోగ్యం బాగోలేదని చెప్పి, ఉద్యోగినిని తన ఇంటికి పిలిపించాడు. దూడను చూస్తున్న సమయంలో తిరుపతయ్య బలవంగా ఆమె చేయి పట్టుకుని లాగాడు. మహిళ కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు అక్కడికి వచ్చి పోలీసులకు సమాచారం అందించారు.
Similar News
News October 10, 2025
TODAY HEADLINES

✒ తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు బ్రేక్
✒ BC రిజర్వేషన్ల జీవో, ఎన్నికల నోటిఫికేషన్‌పై హైకోర్టు స్టే
✒ BCలకు 42% రిజర్వేషన్లు ఇచ్చాకే ఎన్నికలు: TPCC చీఫ్
✒ APలో రేపటి నుంచి NTR వైద్య సేవలు బంద్: నెట్‌వర్క్ ఆస్పత్రులు
✒ NOVలో టెట్, JANలో DSC నోటిఫికేషన్: మంత్రి లోకేశ్
✒ మోదీతో భేటీ.. వికసిత్ భారత్ జర్నీలో భాగం అవుతామన్న బ్రిటన్ PM స్టార్మర్
✒ WWCలో భారత్‌పై సౌతాఫ్రికా విజయం
News October 10, 2025
IPS ఆత్మహత్య.. DGPపై కేసు నమోదు

హరియాణాలో సంచలనం సృష్టించిన IPS ఆఫీసర్ పూరన్ కుమార్ <<17954358>>ఆత్మహత్య<<>> కేసులో ఆ రాష్ట్ర డీజీపీ శత్రుజీత్ సింగ్‌పై కేసు నమోదైంది. పూరన్ భార్య, IAS అన్మీత్ కుమార్ ఫిర్యాదుతో డీజీపీతో పాటు రోహ్‌తక్ ఎస్పీ నరేంద్ర బిజర్నియాపైనా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు ఫైల్ అయింది. మంగళవారం పూరన్ కుమార్ తన తుపాకీతో కాల్చుకొని చనిపోయారు. ఉన్నతాధికారుల కుల వివక్ష వేధింపులతోనే తన భర్త ఆత్మహత్య చేసుకున్నారని భార్య ఆరోపించారు.
News October 10, 2025
పటాన్‌చెరు LIGలో పేలుడు

పటాన్‌చెరులోని రామచంద్రపురంలోని LIGలో గురువారం రాత్రి పేలుడు సంభవించింది. ఇందులో గ్యాస్ లీక్ కాగా కట్టడి చేసేందుకు ప్రయత్నించిన సమయంలో పేడులు జరిగింది. ఈ ఘటనలో అనంత్ స్వరూప్(22) అనే మృతి చెందినట్లు తెలిసింది. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చారు. కాగా ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.