News April 5, 2025
పల్నాడు: హత్య కేసులో UPDATE

పల్నాడు జిల్లాలో మూడ్రోజుల క్రితం జరిగిన హత్య కేసు వివరాలను పోలీసులు వెల్లడించారు. మాచర్ల (మం) పశువేములకు చెందిన హరిశ్చంద్ర, అతని అల్లుడు బ్రహ్మంకు మధ్య గొడవలు జరిగ్గా హరిశ్చంద్ర గొడ్డలితో దాడి చేశాడు. బ్రహ్మం సోదరుడు రమేశ్‌కు తీవ్ర గాయాలై కోమాలోకి వెళ్లాడు. ప్రస్తుతం అతను గుంటూరు జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్నాడు. ఈ క్రమంలో హరిశ్చంద్రను కిడ్నాప్ చేసి హతమార్చినట్లు పోలీసులు భావిస్తున్నామన్నారు.
Similar News
News April 5, 2025
సిర్పూర్ (టి): పెనుగంగలో వ్యక్తి మృతదేహం

సిర్పూర్ (టి) మండలం టోంకిని గ్రామ సమీపంలోని పెన్ గంగలో శనివారం గుర్తుతెలియని మృతదేహం లభ్యమైనట్లు ఎస్ఐ కమలాకర్ తెలిపారు. మృతుడి వయసు సుమారు 60 ఉంటుందని, సమాచారం తెలిసినవారు స్టేషన్‌లో సంప్రదించాలని సూచించారు.
News April 5, 2025
శ్రీలంక అభివృద్ధికి 2.4 బిలియన్లు: PM మోదీ

శ్రీలంకలోని తూర్పు ప్రాంతాల అభివృద్ధికి 2.4 బిలియన్ల శ్రీలంక రూపాయలను అందిస్తున్నట్లు ప్రధాని మోదీ ప్రకటించారు. మోదీ శ్రీలంక పర్యటనలో ప్రెసిడెంట్ అనుర కుమారతో రక్షణ, ఎలక్ట్రిసిటీ గ్రిడ్ కనెక్టివిటీకి సంబంధించి పలు ఒప్పందాలు చేసుకున్నారు. గత ఆర్నెల్లలో శ్రీలంకకు ఇచ్చిన 100 మిలియన్ డాలర్ల రుణాలను గ్రాంట్లుగా మార్చామని మోదీ తెలిపారు. తమిళ జాలరులను విడుదల చేయాలని ఆ దేశ ప్రభుత్వాన్ని కోరారు.
News April 5, 2025
MDCL: ఇంటి వద్దనే టీకా..ఎందుకలా..?

గ్రేటర్ హైదరాబాద్‌లో అనేక మంది 15 ఏళ్లలోపు పిల్లలకు అందించాల్సిన టీకాలను ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు వచ్చి తీసుకోవాల్సి ఉంటుంది. అయితే కొన్ని టీకాలు తీసుకుని కొన్ని నెలల తర్వాత మానేస్తున్నారని వైద్య బృందం గుర్తించింది. దీంతో పిల్లలు వివిధ వ్యాధుల బారిన పడుతున్నారని గమనించి, ఇక లాభం లేదని గుర్తించి, పిల్లల ఇంటికే వెళ్లి టీకాలు వేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు డాక్టర్లు తెలిపారు.