News January 4, 2025
పల్లె పండుగ రోడ్లను త్వరగా పూర్తి చేయండి: ప్రకాశం కలెక్టర్
పల్లెపండుగ కార్యక్రమంలో భాగంగా చేపట్టిన రోడ్ల నిర్మాణ పనులను అత్యంత వేగంగా పూర్తి చేయాలని కలెక్టర్ తమీమ్ అన్సారియా స్పష్టం చేశారు. పనుల పురోగతిపై శనివారం ప్రకాశం భవనంలో సంబంధిత అధికారులతో ఆమె సమీక్షించారు. చేసిన పనులకు బిల్లులను ప్రభుత్వం తక్షణమే చెల్లిస్తున్నందున పనులను వేగవంతం చేసి బిల్లులను అప్లోడ్ చేయాలని చెప్పారు. జిల్లాకు కేటాయించిన పనులు, వాటి పురోగతిపై నియోజకవర్గాల వారీగా ఆమె ఆరా తీశారు.
Similar News
News January 6, 2025
ఒంగోలు: ‘ఇలా చేస్తే మరణాలను నివారించవచ్చు’
ఒంగోలు సర్వజన ఆసుపత్రిలో సోమవారం జిల్లాలోని ఏఎన్ఎంలకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. జిల్లా ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో డాక్టర్ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. అధిక రక్తపోటు, మధుమేహం, రక్తస్రావంతో బాధపడుతున్న వారిని సరైన సమయంలో గుర్తించి వైద్య సేవలు అందించడం ద్వారా మాతృ మరణాలు, శిశు మరణాలను నివారించవచ్చు అని తెలిపారు.
News January 6, 2025
ప్రకాశంలో మహిళా ఓటర్లే ఎక్కువ.!
జిల్లా రెవెన్యూ అధికారి చిన్న ఓబులేసు తన ఛాంబర్ సోమవారం ప్రకాశం జిల్లాకు సంబందించిన 8 నియోజకవర్గాల నూతన ఓటరు లిస్టుల సీడీ కాపీలను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో మొత్తం పోలింగ్ బూతులు..2183, జిల్లా మొత్తం ఓటర్లు 1819448, పురుషు ఓటర్లు 905885, మహిళా ఓటర్లు 913450, థర్డ్ జండర్ ఓటర్లు 113 మంది అని తెలిపారు. జిల్లా లో పురుషుల కంటే మహిళలే ఎక్కువ ఓట్లు కలిగి ఉన్నారని తెలిపారు.
News January 6, 2025
ఉపాధి పనులు ప్రణాళికాబద్ధంగా నిర్వహించాలి: ప్రకాశం కలెక్టర్
ప్రకాశం జిల్లాలోని మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ క్షేత్ర సహాయకులకు సోమవారం ఒంగోలులో శిక్షణ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా మాట్లాడుతూ.. గ్రామాల్లో కూలీలకు రూ.300 వేతనం పెంచుటానికి ఏఏ ప్రణాళికలు ఉన్నాయో క్షేత్ర సహాయకులను అడిగి తెలుసుకున్నారు. ఉపాధి హామీ కార్యక్రమంలో అమలుపరుస్తున్న పల్లె పండుగ పనులను త్వరగా పూర్తిచేయాలని ఆదేశించారు.