News April 7, 2025
పల్వంచ: తాళం వేసిన ఇంట్లో దొంగతనం

పల్వంచ మండలం ఆరేపల్లి గ్రామానికి చెందిన సాయిలు శనివారం రాత్రి తన ఇంటికి తాళం వేసి వెళ్లరు. తిరిగి వచ్చే సరికి గుర్తు తెలియని వ్యక్తులు తాళం పగలగొట్టి బీరువాలోని మూడు తులాల బంగారం పుస్తెల తాడు, రూ.20,000 నగదును దొంగలించినట్లు పోలీసులు చెప్పారు. అదే గ్రామానికి చెందిన భువనగిరి రాజు ఇంటిలో కూడా తాళం పగలగొట్టి దొంగతనానికి పాల్పడినట్లు ఎస్ఐ అనిల్ ఆదివారం చెప్పారు. కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ పేర్కొన్నారు.
Similar News
News April 9, 2025
వికారాబాద్ మార్కెట్ కమిటీకి రూ.4.87 కోట్లు

వికారాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీకి 2024-25 ఏడాదిలో రూ.4.87 కోట్ల మార్కెట్ ఫీజ్ వచ్చిందని వికారాబాద్ మార్కెట్ కమిటీ కార్యదర్శి ఫసి యుద్దీన్ తెలిపారు. ఇందులో వికారాబాద్ జిల్లాలో తాండూర్ మార్కెట్ కమిటీ ప్రథమ స్థానంలో నిలువగా.. వికారాబాద్ మార్కెట్ కమిటీ 2వ స్థానంలో నిలిచింది. దాదాపు రూ.500 కోట్ల వ్యాపారం జరిగినట్టు ఆయన పేర్కొన్నారు.
News April 9, 2025
కొనసాగుతున్న అల్పపీడనం

AP: పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం మరింత బలపడింది. దీంతో ఈరోజు, రేపు రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వర్షపాతం నమోదు కావొచ్చని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఇక 11న ఉత్తరాంధ్రలోని పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని పేర్కొంది. మరోవైపు ఏలూరులో 5 మండలాలు, ఎన్టీఆర్ జిల్లాలో 2, గుంటూరులో 9, పల్నాడులో 2 మండలాల్లో తీవ్ర వడగాలులు ఉంటాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.
News April 9, 2025
పాడేరులో 89.31శాతం వాల్యుయేషన్ పూర్తి: డీఈవో

పాడేరులో ఏర్పాటు చేసిన స్పాట్ సెంటర్లో ఇప్పటి వరకు 92,116 టెన్త్ పేపర్స్ మూల్యాంకనం చేసినట్లు DEO బ్రహ్మాజీరావు మంగళవారం తెలిపారు. ఇప్పటి వరకు 89.31శాతం వాల్యుయేషన్ పూర్తి అయ్యిందన్నారు. ఇంకా 11,016 పేపర్స్ మూల్యాంకనం చేయాల్సి ఉందని పేర్కొన్నారు. ఇంగ్లిష్, మ్యాథ్స్, ఫిజికల్ సైన్స్, బయాలజికల్ సైన్స్, సోషల్ స్టడీస్ పేపర్స్‌ను ఈ కేంద్రంలో వాల్యుయేషన్ చేస్తున్నామని తెలిపారు.