News February 20, 2026
పల్వంచ: రైతులు లాభసాటి పంటల వైపు మళ్లాలి: మంత్రి తుమ్మల

రైతులు సంప్రదాయ పంటల నుంచి లాభసాటిగా ఉండే ఆయిల్ ఫామ్ సాగు వైపు మళ్లాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పిలుపునిచ్చారు. శుక్రవారం పల్వంచకు వచ్చిన ఆయనకు జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ పుష్పగుచ్ఛం అందించి స్వాగతం పలికారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్వయంగా ఆయిల్ ఫామ్ మొక్కను నాటి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి, తదితరులు ఉన్నారు.
Similar News
News February 20, 2026
హన్మక్కపల్లిలో చిరుత బీభత్సం

వేములవాడ మున్సిపల్ పరిధి హన్మక్కపల్లిలో చిరుతపులి కలకలం సృష్టించింది. గురువారం అర్ధరాత్రి రైతు రోమాల భూమయ్యకు చెందిన ఆవు దూడపై చిరుత దాడి చేసి చంపేసింది. పాదముద్రలను పరిశీలించిన అటవీ శాఖ అధికారులు ఇది చిరుత పనేనని నిర్ధారించారు. అటవీ ప్రాంతాలకు సమీపంలో ఉన్న ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఘటనాస్థలికి చేరుకున్న మున్సిపల్ చైర్మన్ పుల్కం రాజు బాధిత రైతును పరామర్శించారు.
News February 20, 2026
ఎనిమిదేళ్లకే ఇంత టాలెంటా!

రణవీర్ సచ్‌దేవా(8) అద్భుతాలు సృష్టిస్తున్నాడు. 4 ఏళ్లకే నాసా వెబ్‌సైట్‌లో చోటు సంపాదించిన ఈ బుడతడు.. 5 ఏళ్లకే ప్రపంచంలోనే అతిపిన్న వయస్కుడైన ‘యాపిల్ ప్రోగ్రామర్’గా గుర్తింపు పొందాడు. 6 ఏళ్లకే ‘టెడెక్స్’ స్పీకర్‌గా రికార్డు సృష్టించాడు. పర్యావరణంపై తనకున్న అవగాహనతో ‘గ్రీన్ యోధా’గా నిలిచాడు. తాజాగా ఢిల్లీలో జరిగిన ‘ఇండియా ఏఐ సమ్మిట్’లో కీనోట్ స్పీకర్‌గా ప్రపంచ నాయకుల దృష్టిని ఆకర్షించాడు.
News February 20, 2026
రోడ్డు ప్రమాదంలో సారపాక విద్యార్థి దుర్మరణం

ఉన్నత చదువులు చదివి కుటుంబానికి ఆసరాగా నిలుస్తాడనుకున్న యువకుడు రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు. సారపాకకు చెందిన ఇంజనీరింగ్ విద్యార్థి నాగ వెంకట్‌రెడ్డి(20) గుంటూరు హైవేపై బైక్‌పై వెళ్తుండగా ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న వాహనాన్ని ఢీకొనడంతో కిందపడిన అతనిపై నుంచి లారీ వెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. నిరుపేద కుటుంబానికి చెందిన ప్రతిభావంతుడైన విద్యార్థి అకాల మరణంతో గ్రామంలో విషాదం నిండింది.


