News December 20, 2025

పల్స్ పోలియోని విజయవంతం చేయండి: కలెక్టర్

image

జిల్లాలో ఈ నెల 21న నిర్వహించే పల్స్ పోలియో కార్యక్రమాన్ని 100 శాతం విజయవంతం చేయాలని కలెక్టర్ లక్ష్మీశ తెలిపారు. జిల్లాలో 966 పోలియో బూత్‌ల ద్వారా 0-5 ఏళ్లలోపు 2,48,900 మంది చిన్నారులకు పోలియో చుక్కలు వేయనున్నట్లు చెప్పారు. 22, 23 తేదీల్లో ఇంటింటి సర్వే నిర్వహిస్తామని, అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు.

Similar News

News December 22, 2025

అన్నమయ్య: రేపు బంద్

image

అన్నమయ్య జిల్లా కేంద్రంగా రాజంపేటను ప్రకటించాలని ఆ ప్రాంత వాసులు పోరాటాలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేస్తున్నారు. రేపు రాజంపేట బంద్‌కు JAC నేతలు పిలుపునిచ్చారు. ఈ బంద్‌కు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. రాజంపేటకు ద్రోహం చేసిన YCP ఎమ్మెల్యే, MPలు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. YCP అన్యాయం చేసింది మీరైనా న్యాయం చేయండి అంటూ CM చంద్రబాబుకు విజ్ఞప్తి చేశారు.

News December 22, 2025

HYD: 10th విద్యార్థులకు ఇదే లాస్ట్ ఛాన్స్

image

10th విద్యార్థలకు ఇదే లాస్ట్ ఛాన్స్.. నామినల్ రోల్స్‌లో ఏమైనా తప్పులుంటే కరెక్షన్ చేసుకోవాలని నాంపల్లిలోని SSC బోర్డు అధికారులు సూచిస్తున్నారు. ఈ నెల 30 వరకు మాత్రమే అవకాశముందని బోర్డు డైరెక్టర్ పీవీ.శ్రీహరి తెలిపారు. తల్లిదండ్రులూ పాఠశాలలకు వెళ్లి పరిశీలించాలని కోరారు. ముఖ్యంగా ప్రధానోపాధ్యాయులే ఇందుకు బాధ్యత వహించాలని ఆదేశించారు.

News December 22, 2025

ప్రజల్లోకి KCR.. దళపతి ముందు 2 సవాళ్లు

image

AP నీళ్ల దోపిడీ ఆపలేని ప్రభుత్వాన్ని కడిగేందుకు తానే స్వయంగా ప్రజల్లోకి వస్తానని KCR స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ఆయన ముందు 2 సవాళ్లున్నాయి. మొదటిది కూతురు కవిత.. తనపై తప్ప KTR సహా BRS ముఖ్య నేతలపై ఆరోపణలు చేస్తున్నారు. ఈ తరుణంలో ఆమెపై, ప్రత్యర్థుల ప్రశ్నలపై ఏమంటారు? అటు ప్రతిపక్ష నేత అసెంబ్లీకి రావడం లేదని CM రేవంత్ విమర్శిస్తున్నారు. బయటకు వస్తున్న మాజీ సీఎం సభలోకీ వస్తారా? అనేది ఛాలెంజ్2.