News December 23, 2025
పల్స్ పోలియో 99.33 శాతం కవరేజ్: DMHO

గుంటూరు జిల్లాలో DEC 21, 22, 23 తేదీల్లో నిర్వహించిన పల్స్ పోలియో కార్యక్రమంలో లక్ష్యంగా నిర్ణయించిన 2,14,981 మంది పిల్లలలో 2,13,539 మందికి పోలియో చుక్కలు వేయడంతో 99.33 శాతం కవరేజ్ సాధించినట్లు DMHO డా.విజయలక్ష్మి తెలిపారు. ఇంకా 1,442 మంది పిల్లలకు పోలియో చుక్కలు వేయాల్సి ఉందన్నారు. మిగిలిన పిల్లలకు, టీకాలు వేసే క్రమంలో పోలియో చుక్కలు పంపిణీ ఏఎన్ఎంల ద్వారా వేయడం జరుగుతుందని DMHO తెలిపారు.
Similar News
News January 7, 2026
GNT: ధరల పతనానికి బ్రేక్.. మిర్చి మార్కెట్‌లో ప్రభుత్వం ఫుల్ కంట్రోల్

గతేడాది మిర్చి రైతులు ఎదుర్కొన్న ఇబ్బందులు పునరావృతం కాకుండా ముందస్తు చర్యలు చేపట్టామని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. గుంటూరులో జరిగిన సమీక్షలో మిర్చి ధరలు ఈ ఏడాది ఆశాజనకంగా ఉన్నాయన్నారు. సాగు విస్తీర్ణం తగ్గడంతో ఉత్పాదకత 44 శాతం తగ్గిందని, రైతులకు నష్టమేమీ కలగకుండా ఇ-క్రాప్ 100 శాతం అమలు, రసీదులు తప్పనిసరి చేయాలని అధికారులను ఆదేశించారు.
News January 7, 2026
GNT: గుడ్ న్యూస్.. వారికి కేవలం రూ.1కే నెలంతా ఫ్రీ

BSNLఎస్.ఆర్.సి-1 ప్లాన్ పునఃప్రారంభించినట్లు BSNLకొత్తపేట శాఖ డీజీఎం బి.శ్యామ్ ప్రసాద్ ఒక ప్రకటనలో తెలిపారు. సిమ్ కార్డు ఉచితంగా ఇవ్వడంతో పాటూ ఒక్క రూపాయితో 30 రోజుల కాలపరిమితితో అపరిమిత కాలింగ్స్, 100 సందేశాలు, 2GB డేటా ఇస్తున్నామని తెలిపారు. ఈ నెల 31వరకు ఆఫర్ అందుబాటులో ఉంటుందని, వినియోగదారులు ఈ అద్భుతమైన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.
News January 7, 2026
GNT: డిజిటల్ టిక్కెట్‌కు ప్రోత్సాహం.. జనరల్ టిక్కెట్లపై రాయితీ

రైల్ వన్ యాప్ వినియోగాన్ని పెంచేందుకు దక్షిణ మధ్య రైల్వే కొత్త ప్రోత్సాహకం ప్రకటించింది. యాప్ ద్వారా కొనుగోలు చేసే జనరల్ టిక్కెట్లపై 3 శాతం తగ్గింపు ఇస్తామని సీపీఆర్వో ఏ.శ్రీధర్ గుంటూరులో మంగళవారం వెల్లడించారు. ఆన్‌లైన్ చెల్లింపులు చేసినప్పుడు మాత్రమే ఈ రాయితీ వర్తిస్తుందని తెలిపారు. జనవరి 14 నుంచి జులై 14 వరకు ఈ సౌకర్యం అమల్లో ఉంటుంది. టిక్కెట్ కౌంటర్ల వద్ద రద్దీ తగ్గించడమే లక్ష్యమన్నారు.


