News March 20, 2024
పవన్‌ను నేను కలవలేదు: పిఠాపురం వర్మ

పవన్ కళ్యాణ్‌ను ఇటీవల తాను కలిసినట్లు జరుగుతున్న ప్రచారం నిజం కాదని వర్మ పేర్కొన్నారు. ‘పవన్‌తో నేను రెండు మూడు సార్లు ఫొటో దిగాను. 2014లో పవన్‌ను కలిసిన ఫొటోను అప్పుడప్పుడు జనసేన నేతలు వాడుతున్నారు. గతంలో పవన్‌ను కలిసినప్పుడు విజయానికి సీక్రెట్ ఏంటని నన్ను అడిగారు. ఎప్పుడూ కష్టపడుతూ ఉంటానని చెప్పా. అప్పుడు పవనే పిలిచి ఫొటో తీసుకుందామని అడిగారు’ అని ఆయన జ్ఞాపకాలను వర్మ గుర్తు చేసుకున్నారు.
Similar News
News September 25, 2025
కౌలు రైతులకు రుణాలు అందించాలి: కలెక్టర్

సీసీఆర్సీ కార్డులు ఉన్న కౌలు రైతులందరికీ తప్పనిసరిగా వ్యవసాయ రుణాలు అందించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కీర్తి చేకూరి బ్యాంకర్లను ఆదేశించారు. గురువారం రాజమండ్రి కలెక్టరేట్లో జరిగిన సమీక్షా సమావేశంలో ఆమె మాట్లాడారు. రుణాల మంజూరులో బ్యాంకులు రైతులకు ఇచ్చే పాస్‌బుక్‌లలో వివరాలను కచ్చితంగా నమోదు చేయాలని కలెక్టర్ స్పష్టం చేశారు. కౌలు రైతుల ఆర్థికాభివృద్ధికి సహకరించాలని ఆమె కోరారు.
News September 25, 2025
రాజమండ్రి: డ్రంక్ అండ్ డ్రైవ్.. 60 కేసులు నమోదు

రాజమండ్రిలో రోడ్డు ప్రమాదాలను తగ్గించే ఉద్దేశంతో ఎస్పీ డి. నరసింహ కిషోర్ ఆదేశాల మేరకు ట్రాఫిక్ సీఐ ఎండి. అబ్దుల్ నబీ సారధ్యంలో డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించారు. ఈ తనిఖీల్లో 60 కేసులను నమోదు చేశారు. పట్టుబడిన వారిలో 51 మందికి జరిమానా విధించగా, ఆరుగురికి రెండు రోజులు, ముగ్గురికి మూడు రోజులు చొప్పున మొత్తం 9 మందికి కోర్టులో జైలు శిక్ష పడింది.
News September 25, 2025
రాజమండ్రి: జిల్లాకు భారీ వర్ష సూచన

వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో సెప్టెంబర్ 25 నుంచి 27 వరకు జిల్లా వ్యాప్తంగా అధిక వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రభుత్వ యంత్రాంగాన్ని అప్రమత్తం చేసినట్లు జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి గురువారం తెలిపారు. లోతట్టు భూభాగాలు, నదీ తీర ప్రాంతాల్లో నీరు నిలిచే అవకాశం ఉన్నందున, క్షేత్రస్థాయి అధికారులు ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆమె సూచించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ ఈ సందర్భంగా కోరారు.