News March 19, 2024
పవన్‌పై వైసీపీ అభ్యర్థి వంగా గీత సెటైర్స్

పిఠాపురం వైసీపీ అభ్యర్థి వంగా గీత కీలక వ్యాఖ్యలు చేశారు. ఆమె ఈరోజు మీడియాతో మాట్లాడుతూ.. పవన్ కాపు అయితే, నేనూ కాపు ఆడపడుచునే అని అన్నారు. 100 శాతం కాపుల మద్దతు తనకే ఉంటుందని, అన్ని కులాల్లో తనను అభిమానించేవారు ఉన్నారన్నారు. చుట్టం చూపుగా వచ్చి మాటలు చెప్పి వెళ్లిపోయే వారిని ప్రజలు నమ్మరని సెటైర్స్ వేశారు. పిఠాపురంలో కూటమి నుంచి జనసేన అధినేత పవన్ పోటీ చేస్తున్న విషయం తెలిసిందే.
Similar News
News April 2, 2025
రాజమండ్రి: కోర్టు సంచలన తీర్పు

మైనర్ కుమార్తెపై అత్యాచారం కేసులో నేరం రుజువు కావడంతో న్యాయ స్థానం నిందితుడికి యావజ్జీవ కారాగార శిక్షను విధించినట్లు చాగల్లు ఎస్సై కె. నరేంద్ర తెలిపారు. ఆయన వివరాల ప్రకారం..చాగల్లు మండలంలో 2020లో తన మైనర్ కుమార్తెపై ఆమె తండ్రి అత్యాచారం చేయగా గర్భం దాల్చింది. అప్పటి డీఎస్పీ రాజేశ్వరి అరెస్ట్ చేశారు. కేసులో న్యాయస్థానం తండ్రికి యావజ్జీవ శిక్ష, రూ.5 వేలు జరిమానా విధిస్తూ మంగళవారం తీర్పునిచ్చింది.
News April 2, 2025
రాజమండ్రి: అమరావతి చిత్రకళా ప్రదర్శన పోస్టర్ ఆవిష్కరణ

స్థానిక లాలా చెరువు రహదారి ప్రధాన మార్గంలో ఏప్రిల్ 4న జరిగే ‘అమరావతి చిత్రకళా వీధి ప్రదర్శన’కు సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి పేర్కొన్నారు. స్థానిక కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో మంగళవారం మున్సిపల్ కమిషనర్ కేతన్ గార్గ్, రాష్ట్ర సాంస్కృతిక శాఖ సంచాలకులు ఎమ్.మల్లిఖార్జున రావులతో అమరావతి చిత్రకళా వీధి ప్రదర్శన గోడ ప్రతిని కలెక్టర్ ఆవిష్కరించారు.
News April 1, 2025
నల్లజర్ల: అల్లుడిని కత్తితో నరికిన మామ, బావమరిది

నల్లజర్ల ప్రాంతంలో దారుణమైన హత్య జరిగింది. తన అల్లుడైన శివను మామ, బావమరిది కత్తితో నరికి హత్య చేశారు. దీంతో పేరం శివ మృతి చెందాడు. సమాచారం అందిన వెంటనే స్థానిక పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. ఈ ఘటనపై ప్రాథమిక దర్యాప్తు జరుగుతోంది. ఈ హత్య వెనుక గల కారణాలు, నిందితుడి ఉద్దేశం తదితర వివరాలను సేకరిస్తున్నారు.