News March 14, 2026

పవన్ ‘అడవి తల్లి బాట’ వెనుక ప్రత్యేక వ్యూహం!

image

AP: పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని JSP చీఫ్ పవన్ ఇవాళ పాడేరు ఏజెన్సీలో నిర్వహించి ‘అడవితల్లి బాట’ చేపట్టారు. ఆయన కొంతకాలంగా ఏజెన్సీ ప్రాంతాలపై దృష్టిసారించడం వెనుక రాజకీయ వ్యూహం ఉందన్న చర్చ సాగుతోంది. 2019లో 7 ST నియోజకవర్గాలను గెల్చుకొని ఏజెన్సీలో YCP పట్టుబిగించింది. 2024లో కూటమి జోరులోనూ 2సీట్లు గెల్చుకుంది. YCPకి చెక్ పెట్టేలా పవన్ తరచూ గిరిజన ప్రాంతాల్లో పర్యటిస్తున్నారని విశ్లేషిస్తున్నారు.

Similar News

News April 5, 2026

ఆదుకొన్న నితీశ్, క్లాసెన్.. SRH స్కోర్ ఎంతంటే?

image

LSGతో జరుగుతున్న మ్యాచ్‌లో టాపార్డర్ కుప్పకూలినా SRH 156/9 స్కోర్ చేసింది. 7.1 ఓవర్లలో 26 పరుగులకే 4 వికెట్లు కోల్పోగా, ఐదో వికెట్‌కు క్లాసెన్(62), నితీశ్(56) 116 రన్స్ భాగస్వామ్యం నమోదు చేశారు. హెడ్ 7, అభిషేక్ 0, ఇషాన్ 1, లివింగ్‌స్టోన్ 14 విఫలమయ్యారు. షమీ, అవేశ్ ఖాన్, ప్రిన్స్ తలో 2, దిగ్వేశ్, సిద్ధార్థ్ చెరో వికెట్ తీశారు.

News April 5, 2026

మెడలు పట్టి గెంటేసిన పార్టీలోకి వెళ్లేదే లేదు: ఈటల

image

TG: తాను BRSలోకి వెళ్లే ప్రసక్తే లేదని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ తేల్చి చెప్పారు. ఎలాంటి తప్పు చేయకున్నా మెడలు పట్టి బయటకు గెంటేసిన పార్టీలోకి వెళ్లేదే లేదన్నారు. తనను ఎన్నో అవమానాలకు గురి చేస్తూ రాత్రికి రాత్రే BRS నుంచి బర్తరఫ్ చేశారని, అధికార బలంతో తీవ్ర ఇబ్బందులకు గురి చేశారని అన్నారు. తాను పార్టీ మారబోతున్నట్లు కరీంనగర్‌లో కొందరు పోస్టర్లు వేయడం బాధించిందన్నారు.

News April 5, 2026

GK: నేషనల్ మారిటైమ్ డే విశేషాలు

image

* INDలోని సింధియా స్టీల్ నావిగేషన్ కంపెనీకి చెందిన ‘SS లాయల్టీ’ నౌక 1919, APR 5న తొలిసారి ముంబై నుంచి లండన్‌కు బయలుదేరింది.
* ఆ రోజుకు గుర్తుగా ప్రభుత్వం 1964 నుంచి నేషనల్ మారిటైమ్ డేను నిర్వహిస్తోంది.
* దేశ సముద్ర తీరం పొడవు 11,098KM. 12 మేజర్, 217 మైనర్ పోర్టులున్నాయి.
* మొత్తం వాణిజ్యంలో 95% సముద్రాల ద్వారానే జరుగుతోంది.
* ఈ రంగంలో విశేష కృషి చేసిన వారికి ‘సాగర్ సమ్మాన్’ అవార్డులిస్తారు.