News March 26, 2025
‘పవన్ అన్న నువ్వు పిఠాపురం రా..!’

ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ని పిఠాపురం ప్రజలు ఎంతో ప్రేమతో గెలిపించుకున్నారు. ఆయన వచ్చాక పిఠాపురం దశ దిశ మారతాయని ఎంతో ఆత్రుతగా ఇప్పటికీ ఎదురుచూస్తున్నారు. కానీ ఎన్నికల్లో భారీ మెజార్టీతో నెగ్గిన తర్వాత పవన్ పిఠాపురానికి రావడం చాలా తక్కువే. ఏదో కార్యక్రమంలో ఇలా వచ్చి అలా వెళ్తున్నారు. దీంతో తమ గోడు ఎవరికి చెప్పుకోవాలి, పవన్ అన్న నువ్వు పిఠాపురం రా అని ప్రజలు, అభిమానులు కోరుకుంటున్నారు.
Similar News
News March 29, 2025
పుట్టినరోజు శుభాకాంక్షలు

ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.
News March 29, 2025
NZB: అక్రమంగా విక్రయిస్తున్న రెండు గంజాయి పట్టివేత

అక్రమంగా విక్రయిస్తున్న ఎండు గంజాయిని టాస్క్‌ఫోర్స్ బృందం పట్టుకుంది. టాస్క్‌ఫోర్స్ DPEO ఆదేశాల మేరకు డిస్ట్రిక్ట్ టాస్క్‌ఫోర్స్ CI సీహెచ్. విలాస్, SI సింధు ఆధ్వర్యంలో ఖానాపూర్ గ్రామంలోని జన్నెపల్లి రోడ్డులో రైల్వేగేట్ వద్ద మాలపల్లికి చెందిన సోహెబ్ ఖాన్ అనే వ్యక్తి వద్ద ఉన్న బ్యాగులో 2100 గ్రాముల ఎండు గంజాయి లభించింది. అతణ్ని అరెస్టు చేసి ఎస్హెచ్ఓకు అప్పగించారు.
News March 29, 2025
NZB: కుళ్లిపోయిన స్థితిలో మహిళ మృతదేహం

నిజామాబాద్ నగర శివారులోని పాంగ్రలో చంద్రకళ(55) అనే మహిళా హత్యకు గురైంది. కూలిపోయిన స్థితిలో మృతదేహం లభ్యమైంది. ఈమెకు ఇద్దరు కూతుర్లు ఉన్నారు. ఈ నెల 23వ తేదీన కూతురితో మాట్లాడిన చంద్రకళ మరుసటి రోజు నుంచి ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది. దీంతో అనుమానం వచ్చిన కూతురు రమ్య ఇంటికి వచ్చి చూసే సరికి హత్యకు గురైంది. సమాచారం అందుకున్న 4వ టౌన్ ఎస్ఐ శ్రీకాంత్ ఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు.