News December 23, 2025
పవన్ ఓ కాగితం పులి: బొత్స

AP: మెడికల్ కాలేజీలు ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉండాలన్నదే తమ విధానమని YCP నేత బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. ప్రైవేటీకరణ పేరిట అక్రమాలు చేసిన వారందరిపై చర్యలు తప్పవన్నారు. పవన్ కాగితం పులి అని, సినిమా డైలాగ్‌లు, పీకుడు భాష కట్టిపెట్టాలన్నారు. ‘కోటి సంతకాలు ఎవరు పెట్టారని మంత్రి సత్యకుమార్ అంటున్నారు. మీ గ్రామానికి వెళ్లి ప్రైవేటీకరణకు అభ్యంతరముందా అని అడిగితే వాస్తవాలు తెలుస్తాయి’ అని సూచించారు.
Similar News
News February 21, 2026
కెరీర్ గైడెన్స్.. కాల్ చేసి సరైన మార్గాన్ని ఎంచుకోండి!

టెన్త్, ఇంటర్ తర్వాత ఏం చేయాలనే సందేహంలో మీ పిల్లలున్నారా? అలాంటి వారికి సరైన మార్గాన్ని సూచించేందుకు తెలంగాణ ప్రభుత్వం కెరీర్ గైడెన్స్ టోల్ ఫ్రీ నంబర్‌ను ప్రారంభించింది. విద్యార్థులు భవిష్యత్తులో సరైన కోర్సులను ఎంచుకునేందుకు 1800 425 2428 నంబర్‌కు ఫోన్ చేసి సలహాలు పొందవచ్చు. ఆదివారం మినహా ప్రతిరోజూ 9AM నుంచి 6PM వరకు ఈ సేవలు అందుబాటులో ఉంటాయి. SHARE IT
News February 21, 2026
YCP మాజీ ఎంపీ బుట్టా రేణుక ఆస్తుల వేలం

YCP మాజీ ఎంపీ బుట్టా రేణుక, ఆమె భర్త నీలకంఠ శివ ఆస్తులను వేలం వేయనున్నట్లు LIC హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ ప్రకటించింది. వీరు ఆ కంపెనీ నుంచి గతంలో ₹340Cr లోన్ తీసుకున్నారు. కొంతకాలం తర్వాత వాయిదాలు కట్టడం ఆపేయడంతో బకాయిల మొత్తం ₹782.07Crకు చేరింది. దీంతో వారి ఆస్తుల వేలం ప్రక్రియను LIC ప్రారంభించింది. తాజాగా HYD KPHBలో 3,830 చ.గజాల స్థలం వేలానికి ప్రకటన ఇచ్చింది. దీని కనీస విలువ ₹65Crగా పేర్కొంది.
News February 21, 2026
NABARDలో ఉద్యోగాలకు నోటిఫికేషన్

<


