News February 24, 2025
పవన్ కల్యాణ్ సమావేశంలో కాకినాడ ఎంపీ

జనసేన పార్టీ అధినేత, రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నిర్వహించిన సమావేశంలో కాకినాడ ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ పాల్గొన్నారు. ఆదివారం కాకినాడలోని ఎంపీ కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. రాష్ట్ర బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో పవన్ కల్యాణ్ అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సమావేశంలో జనసేన మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.
Similar News
News February 24, 2025
యూజీసీ నెట్లో అర్హత సాధించిన ఆదిలాబాద్ విద్యార్థిని

యూజీసీ నెట్ జేఆర్ఎఫ్ చరిత్ర సబ్జెక్ట్‌లో జిల్లాకు చెందిన విద్యార్థిని అర్హత సాధించింది. పట్టణంలోని ప్రభుత్వ ఆర్ట్స్ కామర్స్ డిగ్రీ కళాశాలకు చెందిన పూర్వ విద్యార్థిని ముండే రుమాతాయి ప్రస్తుతం సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్‌లో పీజీ సెకండ్ ఇయర్ చదువుతుంది. పీజీ చదువుతూనే యూజీసీ నెట్ అర్హత సాధించింది. ఈ నేపథ్యంలో కళాశాల ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ రఘుతో పాటు సిబ్బంది అభినందించారు.
News February 24, 2025
ఆదిలాబాద్‌లో మద్యం అమ్మకాలు బంద్… ఎప్పుడంటే..?

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఆదిలాబాద్ జిల్లాలో మద్యం అమ్మకాలను కలెక్టర్ ఆదేశాల మేరకు నిలిపివేస్తున్నట్లు ఆదిలాబాద్ ఎక్సైజ్ సీఐ విజేందర్ పేర్కొన్నారు. ఈనెల 25న సాయంత్రం నాలుగు గంటల నుంచి 27న సాయంత్రం నాలుగు గంటల వరకు జిల్లాలోని అన్ని వైన్, బార్, కల్లు షాపులు మూసివేయబడతాయని పేర్కొన్నారు. కావున షాప్ యజమానులు ఈ విషయాన్ని గమనించి షాపులు మూసివేయాలని సూచించారు.
News February 24, 2025
కుబీర్: రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ వ్యక్తి మృతి

రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ వ్యక్తి మృతి చెందిన ఘటన కుబీర్ మండలంలో చోటుచేసుకుంది. భైంసా మండలం మిర్జాపూర్ సమీపంలో ఈ నెల 16న రెండు బైకులు ఎదురెదురుగా ఢీకొన్న ఘటనలో కుబీర్‌కు చెందిన సిందే సంతోష్ తలకు తీవ్రంగా గాయమైంది. కాగా నిజామాబాద్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సంతోష్ ఆదివారం మృతి చెందాడని కుటుంబ సభ్యులు తెలిపారు. దీంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.