News August 28, 2024

పవన్ కళ్యాణ్‌కి పుట్టినరోజు బహుమతిగా ఇద్దాం: నాదెండ్ల

image

జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ జన్మదినం సందర్భంగా సెప్టెంబరు 2వ తేదీన పార్టీ నాయకులు, శ్రేణులు కలిసి ప్రజోపయోగ కార్యక్రమాల్లో పాల్గొనాలని మంత్రి నాదెండ్ల మనోహర్ టెలి కాన్ఫరెన్స్ లో పిలుపునిచ్చారు. సెప్టెంబరు 2వ తేదీన అంతా కలిసి ‘క్లీన్ ఆంధ్ర గ్రీన్ ఆంధ్ర’ కాన్సెప్ట్ తో కార్యక్రమాలను ఊరువాడా ఘనంగా నిర్వహిద్దామన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీలోని ప్రతి ఒక్కరూ పాల్గొనాలని కోరారు.

Similar News

News February 11, 2026

బడ్జెట్ సమావేశాల్లో గుంటూరు గళం వినిపించనుందా?

image

అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానుండటంతో గుంటూరు జిల్లాకు చెందిన కూటమి ఎమ్మెల్యేలు అసెంబ్లీలో గళం విప్పేందుకు సిద్ధమయ్యారు. జిల్లాలో ఇద్దరు కీలక మంత్రులు ఉండటంతో పెండింగ్ నిధులు మంజూరవుతాయని ఆశలు వ్యక్తమవుతున్నాయి. సాగునీరు, తాగునీటి సమస్యలు, పెండింగ్ ప్రాజెక్టుల పూర్తి, డ్రైనేజ్, వీధి కుక్కల నియంత్రణ, ఆసుపత్రులు, రోడ్ల అభివృద్ధికి నిధులు కేటాయించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

News February 11, 2026

సేవా రంగంలో గుంటూరు టాప్.. మిగతావాటిలో వెనుకబాటు

image

సేవా రంగంలో గుంటూరు జిల్లా 97 స్కోరుతో రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిచి ‘A+’ గ్రేడ్ సాధించింది. కానీ, టీనేజ్ గర్భధారణల్లో (8-10%) జిల్లా ఆందోళనకర స్థాయిలో ఉండటం గమనార్హం. పదో తరగతి అసెస్‌మెంట్‌లోనూ విద్యార్థులు C, D గ్రేడ్లకే పరిమితమయ్యారు. మరోవైపు, రైల్వే బ్రిడ్జిల (ROB) పనులు నత్తనడకన సాగుతున్నాయి. భూసేకరణ సమస్యలతో జాప్యం జరుగుతోంది. వీటిపై దృష్టి సారించకపోతే ఇబ్బందులు తప్పవు.

News February 11, 2026

GNT: ఇంటర్నెట్ భద్రత పోస్టర్ ఆవిష్కరించిన కలెక్టర్

image

సేఫర్ ఇంటర్నెట్ డే 2026 సందర్భంగా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా, జేసీ అశుతోష్ శ్రీవాస్తవ, జిల్లా రెవెన్యూ అధికారి ఎన్.ఎస్.కె.ఖాజావలి, నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్ (ఎన్‌.ఐ.సీ) బృందం సమక్షంలో మహత్తరమైన సేఫర్ ఇంటర్నెట్ డే 2026 పోస్టర్‌ విడుదల చేశారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ఇంటర్నెట్ బాధ్యతాయుత వినియోగం పై అవగాహన పెంచే సందేశాలు పోస్టర్‌లో ఆకర్షణీయంగా ముద్రించడం జరిగిందన్నారు.