News January 3, 2026

పవన్ కళ్యాణ్‌కు స్వాగతం పలకనున్న మంత్రి అడ్లూరి

image

నేడు ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కొండగట్టు పర్యటన సందర్భంగా ఆయనకు తెలంగాణ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ స్వాగతం పలకనున్నారు. పర్యటనకు సంబంధించిన భద్రత, ట్రాఫిక్, భక్తులకు సౌకర్యాలు సహా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అధికారులను ఆదేశించారు. కొండగట్టులో పర్యటన సజావుగా సాగేందుకు శాఖల సమన్వయం పాటించాలని సూచించారు.

Similar News

News January 7, 2026

కవిత రాజీనామాకు ఆమోదం

image

TG: కవిత రాజీనామాకు మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఆమోదం తెలిపారు. 2025 సెప్టెంబర్‌లో బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ చేయడంతో ఆమె ఎమ్మెల్సీ పదవికి సైతం రాజీనామా చేశారు. నిన్న మండలిలో తన రాజీనామాను ఆమోదించాలని ఛైర్మన్‌ను కోరారు. 2022లో నిజామాబాద్ స్థానిక సంస్థల కోటాలో ఆమె ఏకగ్రీవంగా ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు.

News January 7, 2026

స్మిత్ సంచలనం.. తొలి ప్లేయర్‌గా రికార్డు

image

యాషెస్ సిరీస్ ఐదో టెస్టులో సెంచరీ బాదిన ఆస్ట్రేలియన్ ప్లేయర్ స్టీవ్ స్మిత్ అంతర్జాతీయ క్రికెట్‌లో ఇంగ్లండ్‌పై అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్‌గా నిలిచారు. అన్ని ఫార్మాట్లలో కలుపుకొని 5,085 రన్స్ చేశారు. తర్వాతి స్థానాల్లో బ్రాడ్‌మాన్(AUS-5,028), బోర్డర్(AUS-4,850) ఉన్నారు. మరోవైపు అత్యధిక శతకాల జాబితాలో సచిన్(51), కల్లిస్(45), పాంటింగ్(41), రూట్(41), సంగక్కర(38) తర్వాతి స్థానంలో స్మిత్(37) ఉన్నారు.

News January 7, 2026

యూరియా బుకింగ్ యాప్‌కు విశేష స్పందన: కలెక్టర్

image

యూరియా బుకింగ్ యాప్‌కు జిల్లాలో విశేష స్పందన లభించిందని కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ తెలిపారు. కేవలం 15 రోజుల్లో 1,15,972 యూరియా బ్యాగులను రైతులు బుక్ చేసుకున్నారని తెలిపారు. 1,06,229 బ్యాగులు విక్రయమయ్యాయన్నారు. యాప్‌తో పారదర్శకత పెరిగి, బ్లాక్ మార్కెటింగ్‌కు అడ్డుకట్ట పడిందన్నారు. రైతులు తప్పనిసరిగా యాప్ ద్వారానే బుక్ చేసుకోవాలని సూచించారు. అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.