News January 10, 2026
పవన్ కళ్యాణ్ పర్యటనలో కనిపించని కాకినాడ ఎంపీ

ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ శుక్రవారం పిఠాపురంలో పర్యటించగా, కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ శ్రీనివాస్ ఎక్కడా కనిపించలేదు. పది రోజులు ముందే షెడ్యూల్ ఖరారైనా ఎంపీ రాకపోవడం రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది. అధినేతకు ఆయన దూరంగా ఉంటున్నారనే ప్రచారానికి ఈ పరిణామం బలం చేకూర్చిందని చర్చ సాగుతోంది. కాగా దీనిపై ఇటు పార్టీ గానీ, అటు ఎంపీ గానీ స్పందించలేదు.
Similar News
News February 15, 2026
ఛాంపియన్‌గా కర్నూలు జిల్లా జట్టు

రెండు రోజులుగా కర్నూలు అవుట్‌డోర్ స్టేడియంలో జరుగుతున్న 3వ రాష్ట్రస్థాయి పవర్ లిఫ్టింగ్ పోటీలు ఆదివారంతో ముగిశాయి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహుమతి ప్రధానోత్సవ కార్యక్రమానికి రాజ్యసభ మాజీ సభ్యుడు టీజీ వెంకటేశ్ హాజరై గెలుపొందిన విజేతలకు బహుమతులను అందజేశారు. కర్నూలు జట్టు మొదటి స్థానం, కృష్ణాజిల్లా జట్టు రెండవ స్థానం, గుంటూరు జట్టు మూడో స్థానంలో నిలిచింది.
News February 15, 2026
BIG DAY: రేపే మేయర్లు, ఛైర్‌పర్సన్ల ఎన్నిక

TG: ‘పుర’ పోరు చివరి అంకానికి చేరుకుంది. 116 మున్సిపాలిటీలు, ఏడు కార్పొరేషన్లలో గెలిచిన కౌన్సిలర్లు, కార్పొరేటర్లు రేపు 11AMకు ప్రమాణం చేయనున్నారు. అనంతరం మున్సిపల్ ఛైర్‌పర్సన్, వైస్ ఛైర్‌పర్సన్, మేయర్, డి.మేయర్ ఎన్నిక ప్రారంభమవుతుంది. కౌన్సిలర్లు, కార్పొరేటర్లలో సగం మంది హాజరైతేనే కోరం ఉన్నట్లు పరిగణించి చేయి ఎత్తే విధానంలో అధికారులు ఎన్నిక పూర్తిచేస్తారు. లేదంటే మరో రోజుకు వాయిదా వేస్తారు.
News February 15, 2026
శివరాత్రి వేళ శివాలయాల్లో భారీ బందోబస్తు

మహాశివరాత్రి సందర్భంగా శ్రీకాళహస్తి దేవాలయం సహా తిరుపతి జిల్లా వ్యాప్తంగా ఉన్న శివాలయాల్లో భక్తుల రద్దీ దృష్ట్యా పోలీసులు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు స్వయంగా పర్యటించి ట్రాఫిక్, క్యూలైన్లు, అత్యవసర సేవలపై సమీక్షించారు. కపిలతీర్థంలో విజిలెన్స్ అధికారులతో పరిశీలన చేశారు. సీసీ కెమెరాలు, డ్రోన్లు, ప్రత్యేక బందోబస్తు, ట్రాఫిక్ డైవర్షన్లు అమలు చేశారు.


