News October 13, 2025

పవన్ కళ్యాణ్ పర్యటన నేపథ్యంలో కలెక్టర్ సమీక్ష

image

ఈ నెల 17న రాజోలులో ఉప ముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్‌ పర్యటించనున్న నేపథ్యంలో కలెక్టర్ మహేశ్ కుమార్ సోమవారం అధికారులతో సమీక్ష నిర్వహించారు. రాజోలు ఎమ్మెల్యే దేవా వరప్రసాద్‌తో కలిసి ఏర్పాట్లపై చర్చించారు. పవన్ ‘పల్లె పండుగ 2.0’ పనులను ప్రారంభిస్తారని, చనిపోయిన కొబ్బరి చెట్లను పరిశీలిస్తారని ఈ సందర్భంగా అధికారులు తెలిపారు. పర్యటన పకడ్బందీగా జరిగేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు.

Similar News

News October 13, 2025

8 ఏళ్ల కనిష్ఠానికి రిటైల్ ద్రవ్యోల్బణం

image

భారత కన్జూమర్ ప్రైస్ ఇండెక్స్ ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం SEPలో 1.54% తగ్గినట్లు నేషనల్ స్టాటిస్టిక్స్ ఆఫీస్ తెలిపింది. గత 8 ఏళ్లలో(2017 నుంచి) ఇదే అత్యల్పమని, ఆహార ధరలు తగ్గడమే ఇందుకు ప్రధాన కారణమంది. కూరగాయలు, పప్పులు, పండ్లు, ఆయిల్, ఎగ్స్, పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గి వినియోగదారులకు ఉపశమనం కలిగినట్లు పేర్కొంది. కేరళ 9.05% తగ్గుదలతో టాప్‌లో ఉండగా AP 1.36%, TG -0.15%తో 10, 19 స్థానాల్లో నిలిచాయి.

News October 13, 2025

తిరుపతి జిల్లాలో ITI చదవాలి అనుకుంటున్నారా?

image

తిరుపతి జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ ఐటీఐ కాలేజీల్లో మిగిలిన సీట్లకు 5వ విడత ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. ఈ మేరకు తిరుపతి ప్రభుత్వ ఐటీఐ కళాశాల ప్రిన్సిపల్ గణేశ్ ఓ ప్రకటన విడుదల చేశారు. పదో తరగతి పాస్/ ఫెయిల్ అయిన అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. దరఖాస్తులకు చివరి తేదీ అక్టోబర్ 16. మరిన్ని వివరాలకు దగ్గరలోని ఐటీఐ కాలేజీని సంప్రదించాలి.

News October 13, 2025

ట్రంప్, నెతన్యాహును ప్రశంసించిన మోదీ

image

హమాస్ నిర్బంధం నుంచి రెండేళ్ల తర్వాత ఇజ్రాయెల్ బందీలు విడుదల కావడం పట్ల ప్రధాని మోదీ హర్షం వ్యక్తం చేశారు. ‘బందీలకు లభించిన ఈ స్వేచ్ఛ వారి కుటుంబాల ధైర్యానికి నివాళిగా నిలుస్తోంది. ప్రెసిడెంట్ ట్రంప్ అసమాన శాంతి ప్రయత్నాలు, ప్రైమ్ మినిస్టర్ నెతన్యాహు దృఢ సంకల్పానికి ఇది నిదర్శనం. ఆ ప్రాంతంలో శాంతి నెలకొల్పడానికి ట్రంప్ చేసిన హృదయపూర్వక కృషిని స్వాగతిస్తున్నాం’ అని ట్వీట్ చేశారు.