News March 14, 2025
పవన్ కళ్యాణ్ స్పీచ్‌పై సర్వత్రా ఆసక్తి

పిఠాపురంలోని చిత్రాడ వద్ద మరికాసేపట్లో మొదలుకానున్న ‘జనసేన జయకేతనం’కు ఉపముఖ్యమంత్రి హాజరుకానున్నారు. జనసేన 12వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సభలో ఆయన ఏం మాట్లాడతారనేది ఆసక్తికరంగా మారింది. పవన్ కోసం సీటు త్యాగం చేసిన వర్మకి ఎమ్మెల్సీ సీటు కేటాయించకపోవడంపై ఎలా స్పందిస్తారనేది వేచి చూడాలి. ఆయన భవిష్యత్తు రాజకీయాలపై ఎలాంటి ప్రకటనలు చేస్తారనేది ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Similar News
News September 17, 2025
నా రాజీనామాను ఇంకా ఆమోదించలేదు: కవిత

TG: MLC పదవికి తన రాజీనామాను ఇంకా ఆమోదించలేదని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత తెలిపారు. శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అందుబాటులో లేరని చెప్పారు. ‘రాజీనామాను ఆమోదించిన 6 నెలల్లో ఎన్నికలు నిర్వహించాలి. ఇప్పుడు ఆ పరిస్థితి లేదని అంటున్నారు. నేను ఎన్నికైనప్పుడు ఆ సీటు 6 నెలలకు పైగా ఖాళీగానే ఉంది. అవసరమైతే ఛైర్మన్‌ను మళ్లీ కలుస్తా’ అని మీడియా చిట్ చాట్‌లో వ్యాఖ్యానించారు.
News September 17, 2025
పొగాకు కొనుగోలుకు చర్యలు తీసుకోవాలి: కలెక్టర్

నల్లబర్లీ పొగాకు కొనుగోలులో అంతరాయం లేకుండా అధికారులు వేగంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ తెలిపారు. బాపట్లలోని వేర్ హౌసింగ్ కార్పొరేషన్ గోదాములను కలెక్టర్ బుధవారం పరిశీలించారు. నల్లబర్లీ పొగాకు రైతులను ఆదుకోవడానికి ప్రభుత్వం ముందుకు వచ్చిందన్నారు. నల్లబర్లీ పొగాకు కొనుగోలుపై సంబంధిత అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.
News September 17, 2025
HZB: తల్లిని చూసుకుంటామని ముందుకొచ్చిన కుమారులు

హుజూరాబాద్ మండలం కనుకులగిద్దెకు చెందిన ములుగు రాజమ్మ తన ముగ్గురు కుమారులు తనను పోషించడం లేదని ఆర్డీవోకు ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన RDO ముగ్గురు కుమారులు ఒక్కొక్కరు నెలకు రూ.3,000 చొప్పున తల్లి పోషణ నిమిత్తం ఇవ్వాలని ఇటీవల ఆదేశాలు జారీ చేశారు. కాగా, దీని అమలుపై జిల్లా కలెక్టర్, సంక్షేమ అధికారిణి ఆధ్వర్యంలో విచారణ జరపగా రాజమ్మ కుమారులు ఇకపై తమ తల్లిని చక్కగా చూసుకుంటామని హామీ ఇచ్చారు.